
మణిపూర్ ఘటన.. ప్రధాన నిందితుడి ఇంటిని కాల్చేసిన స్థానికులు
ఈ వార్తాకథనం ఏంటి
మణిపూర్ లో ఇద్దరు గిరిజన మహిళలను నగ్నంగా ఉరేగించిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.
మే 4వ తేదీన జరిగిన ఈ అమానవీయ ఘటన ప్రస్తుతం సభ్యసమాజం తలదించుకునేలా చేసింది.
రాజధాని ఇంఫాల్‌కు 35 కిలోమీటర్ల దూరంలో కాంగ్‌పోక్పి జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది.
ఈ కేసులో ఇప్పటికే నలుగురు నిందితులను మణిపూర్ పోలీసులు అరెస్టు చేశారు. మిగతా వారి కోసం పోలీసులు గాలింపు చర్యలను వేగవంతం చేశారు.
మరోవైపు ఈకేసులో ప్రధాన నిందితుడి ఇంటికి స్థానికులు నిప్పు పెట్టి కాల్చేశారు.
Details
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులిచ్చిన సుప్రీంకోర్టు
మణిపూర్ రాష్ట్రంలో ఇలాంటి ఘటన జరగడం బాధాకరమని, నిందితులను మరణశిక్ష విధించాలని సీఎం బీరెన్ సింగ్ స్పష్టం చేశారు.
గత రెండు నెలులుగా మణిపూర్ లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటివరకూ 140 మందికి పైగా ప్రాణాలను కోల్పోయారు.
మైతీలను ఎస్టీ జాబితాలో చేర్చడానికి అక్కడి ప్రభుత్వం అనుకూలంగా వ్యవహరించడంపై అక్కడి గిరిజనులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీంతో మణిపూర్ లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి.
ఈ ఘటనపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులతో పాటు ఈ విషయంలో ఇప్పటి వరకు తీసుకున్న చర్యలపై ఆరా తీసింది.