
MARION BIOTECH : ఉజ్బెకిస్థాన్ మరణాలకు కారణమైన దగ్గు మందు ఫ్యాక్టరీ రీ ఓపెన్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్
ఈ వార్తాకథనం ఏంటి
మారియన్ బయోటెక్ దగ్గు మందు విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
గతేడాది ఉజ్బెకిస్థాన్ లో 18 మంది చిన్నారుల మరణాలపై తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్న ఫార్మా కంపెనీ మరియన్ బయోటెక్ లో ఉత్పత్తి పునఃప్రారంభం కానుంది.
ఉత్తర్‌ప్రదేశ్ లోని నోయిడాలో భారతీయ కంపెనీ మరియన్ బయోటెక్ తయారు చేసిన దగ్గు మందు 'డాక్1 మ్యాక్స్' మీద ఉజ్బెకిస్థాన్ కీలక నివేదికలను గతంలోనే సమర్పించింది.దీంతో దగ్గు మందులతో పాటు అన్ని రకాల ఔషధాల ఉత్పత్తికి బ్రేక్ పడినట్టైంది.
సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీఎస్ సీవో)మరియన్ బయోటెక్ ప్లాంట్ ను తనిఖీ చేసి సీజ్ చేసింది. ఈ మేరకు నమూనాలను చండీగఢ్‌లోని ప్రాంతీయ ఔషధ పరీక్ష కేంద్రానికి (ఆర్‌డీటీఎల్)కు పంపించింది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
మరియన్ బయోటెక్ ను రీ ఓపెన్ చేసేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
Regulator in India allows Marion Biotech, a pharma firm whose cough syrup has been linked to the deaths of 65 kids in Uzbekistan, to reopen factory https://t.co/PD1HmQwlth
— Jennifer Rigby (@jriggers) October 11, 2023