
#NewsBytesExplainer: నో టాక్స్, నో బిల్స్.. తెలంగాణలో మార్వాడీల దో నంబర్ దందా
ఈ వార్తాకథనం ఏంటి
ప్రస్తుతం దేశంలో జీఎస్టీ అమల్లో ఉన్నప్పటికీ, తెలంగాణ సహా గతంలో అన్ని రాష్ట్రాల్లో సేల్స్ ట్యాక్స్ వ్యవస్థ ఉండేది. జీఎస్టీ అమలుకు ఎనిమిది సంవత్సరాలు కన్నా ఎక్కువ అయ్యినా, కొందరు వ్యాపారులు బిల్లులు ఇవ్వకపోవడం, పన్నుల ఎగవేత కొనసాగించడం వంటి సమస్యలు పట్టించుకోవడం లేదు. ల్స్ టాక్స్ ఉన్నప్పుడు మార్వాడీ వ్యాపారులు పన్నులు ఎగ్గొట్టడమే కాకుండా కొనుగోలుదారులకు బిల్లులు ఇవ్వలేదనే ఆరోపణలు ఉన్నాయి. నగదు లావాదేవీలను తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం ఆన్‌లైన్ చెల్లింపుల విధానం ఏర్పాటు చేసింది. ఈ విధానంలో ప్రతి వ్యాపారి ఆన్‌లైన్ ద్వారా చెల్లింపులు స్వీకరించాల్సిన అవసరం ఉంది. కానీ, కొందరు మార్వాడీ వ్యాపారులు మాత్రమే ఈ నియమాన్ని పాటించడంలేదు.
వివరాలు
తెలంగాణలో మార్వాడీల చరిత్ర
మార్వాడీ వ్యాపారులు తమ దుకాణాల్లో నకిలీ లేదా నాసిరకం సరుకులను విక్రయిస్తూ, వినియోగదారులను మోసం చేస్తున్నారని మార్కెట్ లో ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఈమోసాలకు జీఎస్టీ అధికారులు గమనించడంలేదు,అలాగే తెలంగాణ ప్రభుత్వం కూడా దీన్ని పట్టించుకోకపోవడంపై స్థానిక వ్యాపారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నిజాం హయాంలో వాణిజ్య విస్తరణ కోసం ఉత్తరాది రాష్ట్రాలైన గుజరాత్,రాజస్థాన్ నుంచి వ్యాపారులను ఆహ్వానించారు. వారికీ చార్మినార్,బేగం బజార్, ఉస్మాన్ గంజ్ వంటి ప్రాంతాల్లో దుకాణ సముదాయాలను కేటాయించారు. మొదట్లో ఈ వ్యాపారులు వస్త్ర,బంగారం,ముత్యాలు,డ్రై ఫ్రూట్స్ లాంటి వ్యాపారాలు ప్రారంభించారు. తరువాత మరింత విస్తరించి ఇతర రంగాలలో హోల్‌సేల్ వ్యాపారాలు కొనసాగించారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటైన తర్వాత,ఆంధ్రా ప్రాంత వ్యాపారులు ఇక్కడి నుంచి వెళ్లిపోవడం వీరికి లాభం చేకూర్చింది.
వివరాలు
హోల్‌సేల్ నుండి రీటెయిల్ వరకు..
రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల నుంచి వ్యాపారులు, చెంబు, తాంబాళం, కంచం పట్టుకుని తెలంగాణలో వ్యాపారం విస్తరించడానికి ఇక్కడ వాలిపోతున్నారని స్థానిక వ్యాపారులు చెబుతున్నారు. 2014 వరకు వచ్చిన వ్యాపారుల సంఖ్యతో పోల్చితే, తర్వాతి కాలంలో ఈ సంఖ్య పది రెట్లు పెరిగిందని అంచనా. ఇప్పుడు గ్రామాల స్థాయిలో కూడా మార్వాడీ వ్యాపారులకు స్వీట్ షాపులు ఉన్నాయి. ముంబై, అహ్మదాబాద్, ఢిల్లీ వంటి నగరాల నుంచి సరుకులు హైదరాబాద్‌కు తెచ్చి, హోల్‌సేల్ లో విక్రయింస్తారు. తరువాత జిల్లా కేంద్రాలు, మండలాలు, గ్రామాలలో రిటైల్‌లో విక్రయిస్తున్నారు. ముంబై మొదలు గ్రామస్థాయి వరకు మార్వాడీలే ఉంటున్నారని స్థానిక వ్యాపారులు పేర్కొంటున్నారు. నంబర్ వన్ సరుకు ఏది, నాసిరకం ఏది, వీరి వద్ద స్పష్టంగా తెలుస్తుందని చెబుతున్నారు.
వివరాలు
తెలంగాణలో అన్నింట్లో వారే
తెలంగాణలో వివిధ రంగాల్లో.. కిరాణా, హార్డ్‌వేర్, సిమెంట్, శానిటరీ, ఐరన్ & స్టీల్, స్వీట్స్ , ప్లాస్టిక్, ఎలక్ట్రికల్, రైస్ మిల్స్, వెజిటేరియన్ హోటల్స్, ట్రాన్స్‌పోర్ట్ లలో మార్వాడీలు హోల్‌సేల్ నుండి రీటెయిల్ దాకా విస్తరించారు. మాంసం, మద్యం దుకాణాలు, వైన్ షాపులు, పంక్చర్ షాపులలోకి వీరు అడుగు పెట్టలేదు, ఎందుకంటే వారు శాకాహారులు. ప్రతి ప్రాంతంలో ఒక్కో వ్యాపార రకం ప్రత్యేకంగా అభివృద్ధి చెందింది. ఉదాహరణకు, సిద్దిఅంబర్ బజార్ బంగారం, కిరాణా, ముత్యాలగంజ్ కోసం ప్రసిద్ధి. ఉస్మాన్ గంజ్ కిరాణా, అల్లం, వెల్లుల్లి కోసం. బేగం బజార్ డ్రై ఫ్రూట్స్, కిరాణా కోసం. చార్మినార్ ప్రాంతాలు వస్త్ర, బంగారం వ్యాపారాలకు ప్రసిద్ధి. ఇతర బజార్లు ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, జనరల్ వస్త్రాలు కోసం.
వివరాలు
బిల్లులు, పన్నులు,నకిలీ సరుకులు
స్థానిక వ్యాపారులు విమర్శిస్తున్నట్టు, కొన్న సరుకుకి బిల్లులు ఇవ్వరు ఒక వేళ బిల్లులు కావాలని అడిగితే అదనంగా ట్యాక్స్ చెల్లించాల్సి వస్తుందని చెబుతారు. అనవసరంగా ట్యాక్స్ ఎందుకు చెల్లించాలంటూ మనకే నీతులు చెబుతారు. ఉదాహరణకు, బేగం బజార్‌లో డ్రై ఫ్రూట్స్ చౌక ధరకు అమ్ముతారు,కానీ తీరా చూస్తే అవి నాసిరకం సరుకులు. ఆహార కల్తీ, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, పౌర సరఫరాల అధికారులు, తూనికలు, కొలతల విభాగం, జీహెచ్ఎంసీ, పన్నుల అధికారులు తనిఖీలు జరిపారని చెబుతున్నారు. ఆన్‌లైన్ లేదా కార్డ్ పేమెంట్స్ విధానం అమలుచేస్తే,డబ్బులు ఖాతాలో చేరి సరైన లెక్కలు చూపించాలి. ఇది పన్ను చెల్లింపులను గట్టి నియంత్రణలో ఉంచుతుంది,కానీ చాలా మంది వ్యాపారులు సడలింపులే ఎక్కువగా వాడుతున్నారని విమర్శలు ఉన్నాయి.
వివరాలు
కొత్త మోసాలు - రివర్స్ ట్యాక్స్
ఈ ప్రాంతాల్లో లా అండ్ ఆర్డర్,ట్రాఫిక్ పోలీసులు ప్రతి నెలా మామూలు చెల్లింపులు అందుకుంటున్నారని సమాచారం. వాహనాలను ఆపకుండా, తనిఖీలు చేయకుండా ఉండేందుకు స్థానిక వ్యాపారులు వీలైనంత ముట్టచెబుతారని వాపోతున్నారు. రాత్రి వేళల్లో ఇతర రాష్ట్రాల నుంచి సరుకుల లారీలు, వ్యాన్లు నగరానికి చేరడం,వాటిని సులభంగా పంపిణీ చేయడం జరుగుతుందని పేర్కొంటున్నారు. గత నెలలో,ఎంఎస్ కీషాన్ ఇండస్ట్రీస్ ఎల్‌ఎల్‌పీకి చెందిన కార్యాలయం,గోదాం,తయారీ యూనిట్లలో వాణిజ్య పన్నుల శాఖ తనిఖీలు నిర్వహించింది. కంపెనీ కాపర్ సరుకులు తయారు చేయకుండా, విక్రయించకపోవడంపై పన్ను బిల్లులు జారీ చేసింది. ఖాళీ వాహనాలను మహారాష్ట్రకు పంపినట్టు డాక్యుమెంట్లలో చూపించగా,సరుకుల విలువ రూ.100 కోట్లు పైగా చూపించారని తేలింది. తరువాత,సుమారు రూ.33.20 కోట్లుITC (Input Tax Credit)గా క్లెయిమ్ చేశారు.
వివరాలు
పన్నుల ఎగవేతలో కొత్త, ప్రమాదకర ధోరణి
ఇది తెలంగాణలో పన్నుల ఎగవేతలో కొత్త, ప్రమాదకర ధోరణి అని అధికారులు పేర్కొన్నారు. సికింద్రాబాద్, చార్మినార్ డివిజన్‌లలో మరికొన్ని నకిలీ బిల్లుల మోసాలను గుర్తించారు. ఈ మోసాలు ఎక్కువగా మార్వాడీలు చేస్తున్నారు అని వాణిజ్య పన్నుల అధికారి తెలిపారు. ఈ విధంగా తెలంగాణలో వ్యాపార రంగంలో మార్వాడీల ప్రాభవం, మోసాలు, బిల్లుల సమస్యలు, పన్నుల వ్యవహారాలు, స్థానిక వ్యాపారుల అసంతృప్తి పూర్తి వివరంగా ప్రతిబింబించబడ్డాయి.