
Encounter: కర్రెగుట్టల్లో భారీ ఎన్‌కౌంటర్.. 18 మంది మావోయిస్టులు మృతి
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దులోని కర్రెగుట్టలలో శనివారం ఉదయం భారీ ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. ఈ ఎన్‌కౌంటర్‌లో ఇప్పటివరకు 38 మంది మావోయిస్టులు మృతిచెందినట్లు సమాచారం.
భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు ఇంకా కొనసాగుతుండటంతో, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఈ ఎన్‌కౌంటర్ 'ఆపరేషన్ కగార్' (Operation Kagar) లో భాగంగా జరుగుతోంది.
సరిహద్దు ప్రాంతం ప్రస్తుతం సరిహద్దు కాకుండా యుద్ధభూమిగా మారిపోయింది. దట్టమైన అడవులతో చుట్టుముట్టిన కర్రెగుట్టల్లో భద్రతా బలగాలు భారీ స్థాయిలో కూంబింగ్ నిర్వహిస్తున్నాయి.
కాల్పుల శబ్దాలతో అడవులు దద్దరిల్లిపోతున్నాయి.
Details
కొనసాగుతున్న కూంబింగ్
బలగాలు మావోయిస్టుల మౌలిక దళాలపై బాంబుల వర్షం కురిపిస్తున్నాయని సమాచారం. ఈ దాడుల వల్ల పెద్ద సంఖ్యలో మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది.
ఈ పరిణామాలతో ఛత్తీస్‌గఢ్‌లోని దండకారణ్యంలోని మావోయిస్టు కేంద్రాలలో తీవ్ర కలకలం రేగింది. కర్రెగుట్టలు మావోయిస్టులకు సురక్షిత ఆశ్రయంగా పరిగణించబడుతుండగా, ఇప్పుడు అదే ప్రదేశం వారికీ ప్రాణాంతకంగా మారింది. ఎ
ప్పుడెప్పుడు కాల్పులు తిరిగి ప్రారంభమవుతాయో అన్న భయాందోళనతో అక్కడి పరిస్థితి నిప్పుల కొలిమిలా ఉంది.
భద్రతా బలగాలు టార్గెట్‌గా ఎంచుకున్న కర్రెగుట్ట ప్రాంతంలో ఇంకా భారీగా కూంబింగ్ కొనసాగుతోంది.