గ్రేటర్ నోయిడాలో భారీ అగ్నిప్రమాదం.. ప్రాణభయంతో భవనం నుంచి దూకేస్తున్న జనం
ఈ వార్తాకథనం ఏంటి
అసలే భారీ వర్షాలకు అతలాకుతలం అవుతున్నఉత్తరాదిలో మరో ప్రమాదం చోటు చేసుకుంది.
ఉత్తర్‌ప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలోని గెలాక్సీ ప్లాజా మాల్‌లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. భవనంలోని మూడో అంతస్తులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
దీంతో ప్రాణభయంతో తప్పించుకునేందుకు ప్రజలు వివిధ మార్గాలను అన్వేషించారు. చివరగా ఏకంగా భవనంపై నుంచి ఆగమేఘాల మీద కిందకు జారుకున్నారు. ఈ వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
details
షార్ట్ సర్క్యూట్ వల్లే అగ్ని ప్రమాదం
గ్రేటర్ నోయిడా వెస్ట్‌లోని బిస్రఖ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అవెన్యూ 1, గౌర్ సిటీ పరిధిలోని మూడో అంతస్తులో ఈ అగ్ని ప్రమాదం జరిగింది.
ఘటనపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు.
ఈ క్రమంలో ఎంత మంది గాయపడ్డారనే అంశంపై పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదు. ఈ ఘటనకు షార్ట్ సర్క్యూట్ కారణమని విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి.
ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు ప్రకటించారు.
దేశ జాతీయ రాజధాని ప్రాంతం (NCT) పరిధిలో అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంపై దిల్లీ పరిసర ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు.