LOADING...
MEA: ఆయిల్ కొనుగోలు,రష్యాతో స్నేహంపై తేల్చి చెప్పిన భారత్.. అమెరికా వ్యాఖ్యలపై స్పందించిన ఇండియా..
అమెరికా వ్యాఖ్యలపై స్పందించిన ఇండియా..

MEA: ఆయిల్ కొనుగోలు,రష్యాతో స్నేహంపై తేల్చి చెప్పిన భారత్.. అమెరికా వ్యాఖ్యలపై స్పందించిన ఇండియా..

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 01, 2025
06:23 pm

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా భారత ఉత్పత్తులపై 25 శాతం సుంకాలు విధించిన నేపథ్యంలో,రష్యా నుంచి భారత్ ముడిచమురును దిగుమతించుకోవడంపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అసహనం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. దీనిపై భారత్ నుంచి శుక్రవారం గట్టిగానే ప్రతిస్పందన వచ్చింది. ఈ విషయంలో విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ స్పందిస్తూ, "మన ఇంధన అవసరాలను తీర్చేందుకు,అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులను,అందుబాటులో ఉన్న ఎంపికలను బట్టి నిర్ణయాలు తీసుకుంటాము"అని స్పష్టంగా పేర్కొన్నారు. అమెరికా వర్గాలు మాత్రం భారత్ రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తోందని,దాంతో ఉక్రెయిన్ యుద్ధానికి పరోక్షంగా ఆర్థిక సహాయం జరుగుతోందని అభిప్రాయపడుతున్నాయి. భారత్-అమెరికా సంబంధాల్లో రష్యా నుంచి చమురు కొనుగోలు చికాకు కలిగించే అంశంగా అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో అన్నారు.

వివరాలు 

రష్యా మనకు నేటికీ ఒక విశ్వసనీయ భాగస్వామి

ఇక రష్యాతో సంబంధాలు, చమురు దిగుమతుల అంశాలపై భారత్ శుక్రవారం తేల్చి చెప్పింది. దశాబ్దాలుగా భారత్-రష్యా మధ్య ఉన్న బంధాన్ని ప్రస్తావిస్తూ, ''రష్యా మనకు నేటికీ ఒక విశ్వసనీయ భాగస్వామి, అన్ని కాలాల్లో మిత్రుడిగా నిలిచింది'' అని రణధీర్ జైశ్వాల్ పేర్కొన్నారు. గతంలో ఏర్పడిన విదేశాంగ విధానాలను బలవంతంగా మార్చేలా ఏ దేశం తమను ఒత్తిడి చేయలేదని చెప్పారు. రష్యాతో భారత సంబంధాలను మూడో దేశం వారి దృష్టితో చూడకూడదని భారత్ స్పష్టం చేసింది. రష్యాతో తమ స్నేహం స్థిరమైన, కాలానికి పరీక్షకు నిలబడిందని అభివర్ణించింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

Twitter Post