LOADING...
Hyderabad:హైదరాబాద్‌ వాసులకు హెచ్చరిక.. ఈ సాయంత్రం పలు ప్రాంతాల్లో భారీ వర్ష సూచన హెల్ప్‌లైన్ ఫోన్ నంబ‌ర్లు ఇవే..
హైదరాబాద్‌ వాసులకు హెచ్చరిక.. ఈ సాయంత్రం పలు ప్రాంతాల్లో భారీ వర్ష సూచన

Hyderabad:హైదరాబాద్‌ వాసులకు హెచ్చరిక.. ఈ సాయంత్రం పలు ప్రాంతాల్లో భారీ వర్ష సూచన హెల్ప్‌లైన్ ఫోన్ నంబ‌ర్లు ఇవే..

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 09, 2025
11:31 am

ఈ వార్తాకథనం ఏంటి

రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు నగర జీవనాన్ని దెబ్బతీశాయి. గురువారం,శుక్రవారం రాత్రివేళలు కురిసిన వర్షంతో లోతట్టు ప్రాంతాలు మునిగిపోయాయి. రహదారులపైకి నీరు చేరి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ట్రాఫిక్‌ గంటల కొద్దీ నిలిచిపోవడంతో పౌరులు ఇరుక్కుపోయారు. అధిక వర్షపాతం కారణంగా నగరంలోని అనేక ప్రాంతాల్లో చెట్లు కూలిపోయాయి. ఫలితంగా విద్యుత్‌ సరఫరా ఆగిపోవడంతోపాటు మొత్తం నగరం అస్తవ్యస్తమైంది. ఇలాంటి పరిస్థితుల్లో జీహెచ్ఎంసీ,హైడ్రా సిబ్బంది అప్రమత్తంగా ఉండి, నిరంతరం సహాయక చర్యలు చేపడుతున్నారు. అయితే, వాతావరణ శాఖ అంచనా ప్రకారం శనివారం సాయంత్రం కూడా భారీ వర్షం కురిసే అవకాశం ఉంది.

వివరాలు 

హైదరాబాద్‌లో మధ్యాహ్నం తర్వాత మోస్తరు నుండి భారీవర్షం పడే అవకాశం

వాతావరణ శాఖ తాజా అంచనాల ప్రకారం ఈరోజు హైదరాబాద్‌ పరిసర జిల్లాలు సంగారెడ్డి,మెదక్‌, వికారాబాద్‌,కామారెడ్డి,సిద్ధిపేటలోని పలు ప్రాంతాలు, అలాగే నల్గొండ,యాదాద్రి భువనగిరి, మహబూబాబాద్‌, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, జనగాం, వరంగల్‌, ములుగు జిల్లాల కొన్ని ప్రాంతాల్లో భారీవర్షాలు కురిసే అవకాశం ఉంది. హైదరాబాద్‌లో ఈ మధ్యాహ్నం తర్వాత మోస్తరు నుండి భారీవర్షం పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ముఖ్యంగా పటాన్‌చెరు, ఇస్నాపూర్‌, అమీన్‌పూర్‌ ప్రాంతాల్లో అధిక వర్షం కురిసే అవకాశం ఉంది. మధ్యాహ్నం వరకు నగరంలో వాతావరణం పొడి గానే ఉండి, తరువాత సాయంత్రం నుండి రాత్రి వరకు వర్షాలు పడతాయి. కొన్ని ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసే అవకాశమున్నందున బయటకు వెళ్లేవారు తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.

వివరాలు 

సహాయక హెల్ప్‌లైన్‌ నంబర్లు: 

ఎన్డీఆర్ఎఫ్: 8333068536 ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్: 8712596106 హైడ్రా: 9154170992 ట్రాఫిక్: 8712660600 సైబరాబాద్: 8500411111 రాచకొండ: 8712662999 టీజీఎస్పీడీసీఎల్: 7901530966 టీజీఎస్ఆర్టీసీ: 9444097000 జీహెచ్ఎంసీ: 8125971221 హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్‌బీ: 9949930003

వివరాలు 

హిమాయత్‌సాగర్‌ నాలుగు గేట్లను ఎత్తివేత 

ఇక, భారీ వర్షాల కారణంగా మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తోంది. దాని పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. అంతేకాక, రాజేంద్రనగర్‌ నుండి హిమాయత్‌సాగర్‌ వైపు వెళ్లే సర్వీస్‌ రోడ్డుపై వాహన రాకపోకలను నిలిపివేశారు. సర్వీస్‌ రోడ్డు బ్రిడ్జి మీదుగా భారీగా వరదనీరు ప్రవహిస్తుండటంతో ఆ మార్గం మూసివేశారు. హిమాయత్‌సాగర్‌లోకి పెద్ద ఎత్తున వరదనీరు చేరుతుండటంతో జలమండలి అధికారులు నాలుగు గేట్లను ఎత్తి నీటిని కిందకు విడుదల చేస్తున్నారు.