Congress: 'సింధియా టూ దేవరా'.. 2020 నుంచి కాంగ్రెస్‌ను వీడిన టాప్ లీడర్లు వీరే
మహారాష్ట్రకు చెందిన ప్రముఖ నాయకుడు, గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితుడైన మిలింద్ దేవరా ఆదివారం కాంగ్రెస్‌కు రాజీనామా చేసి.. ఏకనాథ్ షిండే నేతృత్వంలోకి శివసేనలో చేరారు. దేవరా కుటుంబం గత 55ఏళ్లుగా గాంధీ ఫ్యామిలీతో సన్నిహితంగా మెలుగుతూ వస్తోంది. అలాంటి నేత పార్టీకి రాజీనామా చేయడం సంచలనంగా మారింది. అది కూడా రాహుల్ గాంధీ 'భారత్ జోడో న్యాయ్ యాత్ర' ప్రారంభమైన రోజు.. మరికొద్ది నెలల్లోనే లోక్‌సభ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో దేవరా పార్టీని వీడటం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకొన్నది. సీనియర్లు కాంగ్రెస్ పార్టీని వీడటం కొత్తేమీ కాదు. గత నాలుగేళ్లుగా పార్టీని వీడుతున్న సీనియర్ల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఈ క్రమంలో 2020నుంచి కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన సీనియర్లు ఎవరో తెలుసుకుందాం.
జ్యోతిరాదిత్య సింధియా
మధ్యప్రదేశ్‌కు చెందిన జ్యోతిరాదిత్య సింధియా.. ఒకప్పుడు రాహుల్ గాంధీకి సన్నిహితుడు. జ్యోతిరాదిత్య సింధియా 2020 మార్చిలో కాంగ్రెస్‌కు రాజీనామా చేసి.. బీజేపీలో చేరారు. తన వర్గం ఎమ్మెల్యేలతో సింధియా కాంగ్రెస్‌ను వీడటంతో.. రాష్ట్రంలో కమల్ నాథ్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోయింది. ఆ తర్వాత సింధియా కేంద్రంలో పౌర విమానయాన శాఖ మంత్రిగా ఉన్నారు. గులాం నబీ ఆజాద్ గులాం నబీ ఆజాద్ కాంగ్రెస్ నాయకుడిగా ఉండేవారు. కాంగ్రెస్ అసమ్మతి గ్రూపు G-23లో భాగమైన ఆయన 2022లో కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆయన పార్టీపై, రాహుల్‌పై పలు ఆరోపణలు చేశారు. గులాం నబీ ఆజాద్ ఏ పార్టీలో చేరకుండా.. సొంత పార్టీని పెట్టుకున్నారు.
కపిల్ సిబల్
మే 16, 2022న మాజీ కేంద్ర మంత్రి కపిల్ సిబల్ కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు. ప్రస్తుతం కపిల్ సిబల్ ఏ పార్టీలోనూ చేరలేదు. సునీల్ జాఖర్ పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న సునీల్ జాఖర్ 2022లో కాంగ్రెస్‌ను వీడారు. అప్పటి ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీపై విమర్శలు చేసినందుకు పార్టీ ఆయనకు షోకాజ్ నోటీసు జారీ చేసింది. ప్రస్తుతం జాఖర్ బీజేపీలో ఉన్నారు. హార్దిక్ పటేల్ గుజరాత్‌లోని పాటిదార్ నాయకుడు హార్దిక్ పటేల్ కూడా 2022 మేలో కాంగ్రెస్‌ను వీడారు. 2019లో ఆయన కాంగ్రెస్‌లో చేరారు. ప్రస్తుతం బీజేపీ తరఫున టికెట్‌పై ఎమ్మెల్యేగా ఉన్నారు.
అశ్వినీ కుమార్
పంజాబ్ ఎన్నికల సందర్భంగా జరుగుతున్న గందరగోళ పరిస్థితుల మధ్య మాజీ కేంద్ర మంత్రి అశ్విని కుమార్ కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ అశ్విని కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ గ్రౌండ్ రియాలిటీకి దూరమైందని ఆరోపించారు. ఆర్పీఎన్ సింగ్ ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆర్పీఎన్ సింగ్ కూడా కాంగ్రెస్‌ను వీడారు. పార్టీ ఆయన్ను స్టార్ క్యాంపెయినర్‌గా నియమించిన తర్వాత కూడా ఆయన పార్టీని వీడటం గమనార్హం. ఆ తర్వాత ఆర్పీఎన్ సింగ్ బీజేపీలో చేరారు. అల్పేష్ ఠాకూర్ గుజరాత్‌లో కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే అల్పేష్ ఠాకోర్ 2019జూలైలో బీజేపీలో చేరారు. అంతకుముందు రాజ్యసభ ఉప ఎన్నికలో అల్పేష్ ఠాకోర్ కాంగ్రెస్ అభ్యర్థికి వ్యతిరేకంగా ఓటు వేశారు.
కెప్టెన్ అమరీందర్ సింగ్
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు అప్పటి ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ కాంగ్రెస్‌కు రాజీనామా చేసి కొత్త పార్టీని స్థాపించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడంతో.. తన పార్టీని బీజేపీలో విలీనం చేసి.. ఆయన కూడా అందులో చేరిపోయారు. జితిన్ ప్రసాద్ జూన్ 2021లో, ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన బ్రాహ్మణ నాయకుడు జితిన్ ప్రసాద్ కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు. కాంగ్రెస్‌కు ఓటు బ్యాంకు తగ్గడం వల్లే తాను కాంగ్రెస్‌ను వీడానని చెప్పారు. ప్రస్తుతం జితిన్ యూపీలో మంత్రిగా ఉన్నారు. అనిల్ ఆంటోనీ జనవరి 2023లో కేరళకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ఏకే ఆంటోనీ కుమారుడు అనిల్ ఆంటోనీ కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరారు. బీజేపీలో చేరే సమయంలో మోదీపై ప్రశంసలు కురిపించారు.