Uttam Kumar Reddy: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి పితృవియోగం
తెలంగాణ రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి తండ్రి పురుషోత్తమ్ రెడ్డి మరణించారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన, హైదరాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఈ వార్తతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంట విషాద ఛాయలు అలుముకున్నాయి. పురుషోత్తమ్ రెడ్డి అంత్యక్రియలు ఈ రోజు సాయంత్రం 6 గంటలకు మహాప్రస్థానంలో జరగనున్నాయి. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి పితృ వియోగం విషయాన్ని తెలుసుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, వివిధ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు.