తదుపరి వార్తా కథనం
కరీంనగర్: ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి ప్రయాణిస్తున్న కారుకు ప్రమాదం
వ్రాసిన వారు
Stalin
Jun 12, 2023
10:49 am
ఈ వార్తాకథనం ఏంటి
భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి ప్రయాణిస్తున్న కారుకు ఘోర ప్రమాదం జరిగింది.
ఎదురుగా వస్తున్న బైక్ ను తప్పించబోయిన ఆయన కారు కాలువలోకి దూసుకెళ్లింది.
అయితే ఈ ప్రమాదంలో పాడి కౌశిక్ రెడ్డికి ఎలాంటి ప్రమాదం జరగకపోడవంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.
ఈ ఘటన కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలంలో జరిగింది. ముఖ్యంగా కారు కాలువలోకి బలంగా దూసుకెళ్లిన సమయంలో ఎయిర్ బెలూన్స్ తెరుచుకున్నాయి.
దీంతో పెను ప్రమాదం తెప్పినట్లయ్యింది. ఈ క్రమంలో పాడి కౌశిక్ రెడ్డి వాహనం భారీగా దెబ్బతినడంతో ఆయన ఎస్కార్ట్ వాహనంలో హుజురాబాద్ వెళ్లిపోయారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ప్రమాద దృశ్యాలు
MLC కౌశిక్ రెడ్డికి తప్పిన ప్రమాదం pic.twitter.com/MMyvmOF1nc
— V6 News (@V6News) June 12, 2023