తదుపరి వార్తా కథనం
Narendra Modi: 29న తెలుగుభాషా దినోత్సవం.. శుభాకాంక్షలు తెలిపిన మోదీ
వ్రాసిన వారు
Jayachandra Akuri
Aug 26, 2024
11:41 am
ఈ వార్తాకథనం ఏంటి
ఈనెల 29న తెలుగు భాషా దినోత్సవం జరుపుకుంటున్న వేళ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికీ ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఆదివారం ఆయన మన్ క బాత్ ద్వారా దేశ ప్రజలను ఉద్ధేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా తెలుగు గురించి మాట్లాడారు.
మిత్రులారా.. ఈ నెల 29న తెలుగు దినోత్సవం ఉందని, ఇది నిజంగా అద్భుతమైన భాష అని చెప్పారు.
తెలుగు మాట్లాడే వారందరికీ తన శుభాకాంక్షలను ఆయన తెలియజేశారు.