NewsClick:న్యూస్‌క్లిక్ వ్యవస్థాపకుడు 8,000 పేజీల ఛార్జిషీట్.. ఉగ్రవాద నిధులపై ఆరోపణలు
ప్రముఖ న్యూస్ పోర్టల్ న్యూస్ క్లిక్ (Newsclick) వ్యవస్థాపకుడు ప్రబీర్ పుర్కాయస్థ(Prabir Purkayastha) పై దిల్లీ పోలీసులు తన ఛార్జిషీట్ నమోదు చేశారు. దాదాపు 8,000 పేజీలతో కూడిన చార్జిషీట్ లో తీవ్రవాద నిధులు చైనా ప్రచారాన్ని ప్రోత్సహించడం, 2020 ఢిల్లీ అల్లర్లకు సంబంధించి అనేక నేరాలతో ప్రబీర్ కు లింక్ ఉందని పేర్కొంది. భారత్‌లో చైనా ప్రచారాన్ని ప్రసారం చేసేందుకు నిధులు అందుకున్నారనే ఆరోపణలపై పుర్కాయస్థపై తీవ్రవాద నిరోధక చట్టం UAPA కింద దర్యాప్తు చేస్తున్నారు. న్యూస్‌క్లిక్ వ్యవస్థాపకుడు,హెచ్‌ఆర్ అమిత్ చక్రవర్తిని గత ఏడాది అక్టోబర్ 3న ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ అరెస్టు చేసింది.
ఉగ్రవాద కార్యకలాపాల కోసం నిధులు సేకరించాడన్నఢిల్లీ పోలీసులు
నగరమంతటా పోలీసులు సోదాలు చేసిన తర్వాత వారిని అదుపులోకి తీసుకుని UAPA కింద అభియోగాలు మోపారు. అప్పటి నుంచి వారిద్దరూ ఢిల్లీలోని తీహార్ జైలులో ఉన్నారు. పుర్కాయస్థ ఉగ్రవాద కార్యకలాపాల కోసం నిధులు సేకరించాడని ఢిల్లీ పోలీసులు ఆరోపిస్తున్నారు. ఛార్జిషీట్ ప్రకారం, నిషేధిత లష్కరే తోయిబాతో సహా ఉగ్రవాద సంస్థలకు నిధులు సమకూర్చడం, వారికి మద్దతు ఇవ్వడంలో అతనికి సంబంధం ఉన్నట్లు ఆధారాలు ఉన్నాయన్నారు. అటువంటి కార్యకలాపాల కోసం న్యూస్‌క్లిక్ ద్వారా ₹ 91 కోట్ల నిధులు మంజూరయ్యాయని ఛార్జిషీట్ పేర్కొంది .