LOADING...
Weather: రానున్న మూడు రోజుల్లో భారీ వర్షాలు.. హైదరాబాద్‌ వాతావరణ శాఖ వెల్లడి 
రానున్న మూడు రోజుల్లో భారీ వర్షాలు.. హైదరాబాద్‌ వాతావరణ శాఖ వెల్లడి

Weather: రానున్న మూడు రోజుల్లో భారీ వర్షాలు.. హైదరాబాద్‌ వాతావరణ శాఖ వెల్లడి 

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 20, 2025
11:12 am

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణలో ఎండ తీవ్రతకు ప్రజలు అల్లాడిపోతుండగా, రానున్న మూడు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ బుధవారం ప్రకటించింది. రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వడగండ్ల వానలు, తుఫాను సంభవించే అవకాశం ఉన్నట్లు హెచ్చరించింది. ముఖ్యంగా హైదరాబాద్‌లో మార్చి 22 నుంచి మూడు రోజుల పాటు వాతావరణం పూర్తిగా మారుతుందని పేర్కొంది.

వివరాలు 

41 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు

అలాగే, మిగిలిన జిల్లాల్లోనూ ఉరుములు, బలమైన ఈదురుగాలులతో వడగండ్ల వానలు పడనున్నట్లు తెలిపింది. ఇదిలా ఉండగా, బుధవారం రాష్ట్రంలోని 17 జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 41 డిగ్రీల కంటే ఎక్కువగా నమోదైనట్లు తెలిపింది. అత్యధికంగా మంచిర్యాల జిల్లా భీమారంలో 41.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవగా, ఆదిలాబాద్‌లో 41.3, నిజామాబాద్‌లో 41.2, కొమురంభీం ఆసిఫాబాద్‌లో 41.1, నాగర్‌కర్నూల్‌, జోగులాంబ-గద్వాల్‌లో 41, జగిత్యాల జిల్లాలో 40.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వెల్లడించింది.