తదుపరి వార్తా కథనం

No funds-puri MP candidate-Sucharitha Mohanthy: డబ్బుల్లేవు ....పోటీ చేయలేనని ప్రకటించిన కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి సుచరిత మహంతి
వ్రాసిన వారు
Stalin
May 04, 2024
04:11 pm
ఈ వార్తాకథనం ఏంటి
ఒడిశా (Odisha)లోని పూరి (Puri) లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ (Congress) అభ్యర్థి సుచరిత మహంతి (Sucharitha Mohanthi) పోటీ నుంచి వైదొలిగారు.
ఎన్నికల ప్రచారం నిర్వహించుకునేందుకు కూడా తన వద్ద డబ్బుల్లేవని అందుకే పోటీ నుంచి వైదొలుగుతున్నట్లు ఆమె ప్రకటించారు.
పార్టీ నుంచి తగినంత నిధులు ఇవ్వలేదని పేర్కొంటూ ఆమె టికెట్‌ను తిరిగి ఇచ్చేశారు.
ఎన్నికల ప్రచారం కోసం ప్రజావిరాళాలను సేకరించినప్పటికీ కొంతమొత్తంలో మాత్రమే అవి ప్రచారానికి ఉపయోగపడ్డాయని ఫలితంగా ప్రభావంతంగా తను ఎన్నిక ప్రచారాన్ని నిర్వహించలేకోపోయానని తెలిపారు.
No funds-puri MP candidate