NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / రాజీనామా ప్రచారానికి బీరెన్ సింగ్ ఫుల్ స్టాప్.. మణిపూర్ సీఎంగా కొనసాగనున్నట్లు ప్రకటన 
    తదుపరి వార్తా కథనం
    రాజీనామా ప్రచారానికి బీరెన్ సింగ్ ఫుల్ స్టాప్.. మణిపూర్ సీఎంగా కొనసాగనున్నట్లు ప్రకటన 
    మణిపూర్ సీఎంగా కొనసాగనున్నట్లు ప్రకటన

    రాజీనామా ప్రచారానికి బీరెన్ సింగ్ ఫుల్ స్టాప్.. మణిపూర్ సీఎంగా కొనసాగనున్నట్లు ప్రకటన 

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Jul 26, 2023
    02:37 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    మణిపూర్ ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ రాజీనామా చేస్తున్నారనే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ నేపథ్యంలో స్పందించిన సీఎం, తాను రాజీనామా చేయబోనని తేల్చి చెప్పారు.

    గత కొన్ని నెలలుగా కుకీ, మైతీ తెగల మధ్య జరుగుతున్న ఘర్షణలతో భారతదేశంలోని ఈశాన్య రాష్ట్రం మణిపూర్ అట్టుడుకుతోంది. అంతకంతకూ మణిపుర్ లో పరిస్థితులు దిగజారుతున్నాయి.

    ఇప్పటికే శాంతిభద్రతలు పూర్తిగా దెబ్బతినగా స్థానిక పోలీసులు చేతులెత్తేశారు. ఈ క్రమంలో కేంద్ర బలగాలను సైతం భారీగానే మోహరించారు. అయినప్పటికీ అక్కడక్కడా మహిళలపై పలు ఆకృత్యాలు జరగడం మాత్రం ఆగలేదు.

    ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటన దేశవ్యాప్తంగా దిగ్బ్రాంతికి గురిచేసింది.ఈ నేపథ్యంలోనే నైతిక బాధ్యత వహిస్తూ బీరెన్ సింగ్ రాజీనామా చేయాలని సర్వత్రా డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి.

    details

    మణిపురిలు కోరుకుంటే పదవిని వదిలేస్తా : బీరెన్ సింగ్

    మరోవైపు జాతీయ కాంగ్రెస్ సహా విపక్షాలు సదరు సీఎంను బాధ్యుడిగా చేస్తూ భర్త్ రఫ్ చేయాలని అధికార బీజేపీని డిమాండ్ చేశారు. తాజా పరిణామాల నేపథ్యంలో రాష్ట్ర సీఎంగా బీరెన్ సింగ్ రాజీనామా చేయబోతున్నారంటూ గత కొన్ని రోజులుగా ఊహాగానాలు తీవ్రమయ్యాయి.

    తాను సీఎం పదవి నుంచి తప్పుకునే ప్రశ్నే లేదని స్పష్టం చేశారు. కానీ, కేంద్రం, మణిపురిలు కోరుకుంటే పదవిని వదిలేస్తాన్నారు. తాను ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీకి కార్యకర్తను అని, రాష్ట్రానికి ప్రజలెన్నుకున్న సీఎం అని చెప్పుకొచ్చారు.

    ఇప్పటికైతే తన రాజీనామా ఎవరూ అడగలేదని,అధినాయకత్వం ఆదేశాలను తప్పక అనుసరిస్తానన్నారు. ప్రస్తుతం తన లక్ష్యం మాత్రం మణిపూర్ రాష్ట్రంలో త్వరగా శాంతిని పునరుద్ధరించడమేనని బీరెన్ వివరించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    మణిపూర్
    ముఖ్యమంత్రి

    తాజా

    SRH vs RCB: ఆర్సిబి కి షాక్ .. 42 పరుగుల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్ గెలుపు  ఐపీఎల్
    MLC Kavitha: కేసీఆర్‌ చుట్టూ ఉన్న దెయ్యాల ఉన్నాయి.. వాటి వల్లే పార్టీకి నష్టం: ఎమ్మెల్సీ కవిత కల్వకుంట్ల కవిత
    Chandrababu: అమరావతిని రాజధానిగా నోటిఫై చేయాలని కేంద్రాన్ని కోరాం: సీఎం చంద్రబాబు చంద్రబాబు నాయుడు
    IPL 2025: టీ20లో నాలుగు వేల క్ల‌బ్‌లో అభిషేక్..  అభిషేక్ శర్మ

    మణిపూర్

    మణిపూర్‌లో ఆగని హింస; ఐఈడీ పేలుడు, ముగ్గురికి గాయాలు తుపాకీ కాల్పులు
    మణిపూర్‌లో పరిస్థితి అస్తవ్యస్తంగా ఉంది: సీఎం బీరేన్ సింగ్  నోంగ్‌తోంబమ్ బీరెన్ సింగ్
    మణిపూర్‌లో మహిళలు మా కార్యకలాపాలను అడ్డుకుంటున్నారు: సైన్యం ఆర్మీ
    మయన్మార్ నుంచి సేకరించిన ఆయుధాలతోనే మణిపూర్‌లో హింస: ఇంటెలిజెన్స్ వర్గాలు  మయన్మార్

    ముఖ్యమంత్రి

    125 అడుగుల ఎత్తైన అంబేద్కర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం కేసీఆర్  కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కె.సి.ఆర్)
    వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో బీఆర్ఎస్‌దే  ప్రభుత్వం, దేశవ్యాప్తంగా దళితబంధు అమలు చేస్తాం:కేసీఆర్ భారత రాష్ట్ర సమితి/ బీఆర్ఎస్
    Explainer: యూపీ మొదటి 'గ్యాంగ్‌స్టర్'; 'అతిక్ అహ్మద్' అరెస్టు, మరణం ఎందుకు సంచలనమయ్యాయి?  ఉత్తర్‌ప్రదేశ్
    సచివాలయ ఉద్యోగులకు శుభవార్త.. ప్రొబేషన్ ఖరారు చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం  ఆంధ్రప్రదేశ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025