LOADING...
Tsunami: భారతదేశానికి సునామీ ముప్పు లేదు : ఇన్‌కాయిస్
భారతదేశానికి సునామీ ముప్పు లేదు : ఇన్‌కాయిస్

Tsunami: భారతదేశానికి సునామీ ముప్పు లేదు : ఇన్‌కాయిస్

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 30, 2025
11:26 am

ఈ వార్తాకథనం ఏంటి

రష్యాలోని కామ్చాట్కా ద్వీపకల్పంలో బుధవారం ఉదయం 8.8 తీవ్రతతో తీవ్రమైన భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. ఈ భూకంప ప్రభావంతో రష్యా తీరప్రాంతాలు,జపాన్‌లోని కొన్ని ప్రాంతాలను సునామీ తాకింది. ఈ నేపథ్యంలో భారత్‌కు సునామీ ప్రమాదం లేదని ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ (ఇన్‌కాయిస్)స్పష్టం చేసింది. ఇన్‌కాయిస్ ఈ విషయాన్ని తమ అధికారిక ఎక్స్ ఖాతాలో పేర్కొంది. "కామ్చాట్స్కీ తూర్పు తీర ప్రాంతంలో 8.8 తీవ్రత గల భూకంపం సంభవించింది. అనంతరం అక్కడ సునామీ రావడం జరిగిందని తెలిసింది. అయితే ఈ భూకంపం కారణంగా భారతదేశ తీర ప్రాంతాలకు ఎటువంటి సునామీ ముప్పు లేదు. హిందూ మహాసముద్రానికి ఆనుకొని ఉన్న ఇతర ప్రాంతాలకు కూడా ప్రమాదం లేదని" అంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఇన్‌కాయిస్ చేసిన ట్వీట్ 

వివరాలు 

అప్రమత్తమైన  అమెరికాలోని భారత రాయబార కార్యాలయం 

ఈ భారీ భూకంపం,రష్యా తూర్పు తీరంలోని పెట్రోపావ్లోవ్స్క్-కామ్చాట్స్కీ ప్రాంతాన్ని వణికించింది. అనంతరం సునామీ అలలు రష్యాలోని కురిల్ దీవులు,జపాన్‌లోని హక్కైడో దీవులను తాకాయి. భారీ అలలు సముద్రాన్ని ఉలికిపాటుకు గురిచేశాయి.ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని అమెరికాలోని భారత రాయబార కార్యాలయం అప్రమత్తమైంది. తాము పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తున్నామని ఎక్స్‌లో ఒక పోస్టు ద్వారా తెలియజేసింది. అమెరికాలోని హవాయి,కాలిఫోర్నియా రాష్ట్రాలు సహా పశ్చిమ తీర రాష్ట్రాల్లో నివసిస్తున్న భారతీయులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. అక్కడి స్థానిక అధికారులు జారీ చేసే హెచ్చరికలు,సూచనలను ఖచ్చితంగా పాటించాలని సూచించింది. సునామీ హెచ్చరిక జారీ అయినప్పుడు ఎత్తైన ప్రాంతాలకు తరలిపోవాలని భారత కాన్సులేట్ సూచించింది. ఈసందర్భంగా ఆఫీసు నుంచి సహాయానికి సంబంధించి హెల్ప్‌లైన్ నంబరును కూడా విడుదల చేసింది.