IMD: రైతులకు శుభవార్త: జులైలో సాధారణ వర్షపాతం నమోదు
ఉత్తర్‌ప్రదేశ్, బిహార్‌లోని కొన్ని ప్రాంతాలను మినహాయించి దేశవ్యాప్తంగా జులైలో వర్షాపాతం సాధారణంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం(ఐఎండీ) తెలిపింది. జూన్‌లో మాత్రం 10శాతం లోటు నమోదైనట్లు వెల్లడించింది. జులై పొడవునా సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేసింది. జూన్ నెలలోని రుతుపవనాల లోటు జులైలో కురిసే వర్షాలతో భర్తీ అవుతుందని ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహాపాత్ర పేర్కొన్నారు. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు రావడం ఆలస్యమైంది. దీంతో ఆందోళన వ్యక్తం కాగా, శుక్రవారం పడిన వర్షాలు కాస్త ఊరటనిచ్చాయి. రెండు వారాల క్రితం జూన్ నెల రుతుపవనాల లోటును ఐఎండీ 47శాతంగా అంచనా వేసింది. జూన్ 30నాటికి వర్షాపాతం లోటు 10శాతానికి తగ్గింది.
జులైలో 94% - 106% వరకు వర్షాపాతం
జులైలో దేశవ్యాప్తంగా నెలవారీ సగటు వర్షపాతం చాలావరకు సాధారణం 94శాతం నుంచి 106 శాతం వరకు ఉంటుందని మోహపాత్ర చెప్పారు. జూన్‌లో మొత్తం 16రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు లోటు వర్షపాతం నమోదైంది. బిహార్‌లో 69శాతం, కేరళలో 60శాతం వర్షాపాతంతో సాధారణం కంటే అతి తక్కువగా వర్షాలు పడ్డాయి. గత 25ఏళ్ల ఐఎండీ డేటాను పరిశీలిస్తే, 16ఏళ్లలో జున్ నెలలో వర్షపాతం సాధారణం కంటే తక్కువగా నమోదైందని, జూలైలో సాధారణ వర్షాపాతం నమోదైనట్లు మృత్యుంజయ్ మహపాత్ర చెప్పారు. రుతుపవనాలను ప్రతికూలంగా ప్రభావితం చేసే ఎల్‌నినో పరిస్థితులు జులై చివరి నాటికి అభివృద్ధి చెందే అవకాశం ఉంది. హిందూ మహాసముద్రంలో ఏర్పడే సానుకూల పరిస్థితులతో ఆ ప్రతికూల పరిస్థితులను అధిగమించొచ్చని మృత్యుంజయ్ మహపాత్ర అన్నారు.
ఆ రాష్ట్రాల్లో జులైలో వర్షాపాతం తగ్గే అవకాశం, వరిసాగుపై ప్రభావం
3ట్రిలియన్ డాలర్ల భారత ఆర్థిక వ్యవస్థకు ములస్తంభమైన వ్యవసాయానికి రుతుపవనాలే కీలకం. దేశంలోని దాదాపు 70శాతం జలాశయాలు వర్షపు నీటితోనే నిండుతాయి. ఈ క్రమంలో ఈ సారి రుతువనాలు ఆలస్యమై జలాశయాలు అడుగంటుతున్న పరిస్థితి నెలకొంది. జూన్ నెలలో తక్కువ వర్షాపాతం కారణంగా వరి పంటసాగు విస్తీర్ణం గతేడాదితో పాటు పావు వంతు కంటే తగ్గినట్లు నివేదికలు చెబుతున్నాయి. అయితే జులై నెలలో సాధారణ వర్షాపాతంతో వరిసాగు విస్తీర్ణం పెరిగే అవకాశం ఉంది. ఉత్తర్‌ప్రదేశ్, బిహార్, అస్సాం, పంజాబ్, కర్ణాటక, తమిళనాడులోని కొన్ని ప్రాంతాల్లో జులైలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదు కావొచ్చని ఐఎండీ అంచనా వేసింది. దీంతో ఈ రాష్ట్రాల్లో వరి, పప్పుధాన్యాల పంటల సాగుపై ప్రభావితం చూపతుందని వెల్లడించింది.