Page Loader
Election Notification: నేడు రెండో విడత ఎన్నికల నోటిఫికేషన్
Election Notification: నేడు రెండో విడత ఎన్నికల నోటిఫికేషన్

Election Notification: నేడు రెండో విడత ఎన్నికల నోటిఫికేషన్

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 28, 2024
10:12 am

ఈ వార్తాకథనం ఏంటి

లోక్‌సభ రెండో విడత ఎన్నికలకు నేడు నోటిఫికేషన్‌ విడుదల కానుంది.ఈ విడతలో కేంద్రపాలిత ప్రాంతాలు, 12రాష్ట్రాలలోని 88 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ విడతలో కేరళ,కర్ణాటక,రాజస్థాన్‌,ఉత్తరప్రదేశ్,మహారాష్ట్ర,మధ్యప్రదేశ్‌,అస్సాం,బీహార్‌ ,పశ్చిమ బెంగాల్,ఛత్తీస్‌గఢ్‌,మణిపూర్,త్రిపుర,జమ్ముకశ్మీర్‌లలో ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్ 4వ తేదీ వరకు నామినేషన్లు దాఖలు చేయవచ్చు.ఈ దశకు ఏప్రిల్ 26న పోలింగ్ జరగనుంది. జమ్ముకశ్మీర్‌ మినహా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో నామినేషన్ల పరిశీలన ఏప్రిల్ 5వ తేదీన జరుగుతుంది. జమ్ముకశ్మీర్‌లో ఏప్రిల్ 6వ తేదీన నామినేషన్ల పరిశీలన జరుగుతుంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

రెండో విడత ఎన్నికలకు నేడు నోటిఫికేషన్‌