
Fauja Singh: అథ్లెట్ ఫౌజా సింగ్ మృతి కేసులో నిందితుడు ఎన్నారై అరెస్ట్
ఈ వార్తాకథనం ఏంటి
ప్రపంచంలో అత్యంత పెద్ద వయస్కుడైన మారథాన్ అథ్లెట్‌గా గుర్తింపు పొందిన ఫౌజా సింగ్ (114) రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన విషాదకర ఘటన జరిగింది. ఈ ప్రమాదానికి బాధ్యుడిగా ఉన్న ఎన్‌ఆర్‌ఐ అమృత్‌పాల్ సింగ్ ధిల్లాన్‌ను పంజాబ్ పోలీసులు అరెస్టు చేసినట్లు బుధవారం వెల్లడించారు. పంజాబ్ రాష్ట్రం జలంధర్ జిల్లాలోని బియాస్ అనే గ్రామంలో సోమవారం సాయంత్రం ఫౌజా సింగ్ రోడ్డుపై నడుస్తుండగా, వేగంగా వచ్చిన ఓ గుర్తుతెలియని వాహనం ఆయనను ఢీకొట్టింది. ఢీకొట్టిన తీవ్రతతో ఫౌజా సింగ్ గాల్లోకి ఎగిరి సుమారు ఏడడుగుల దూరంలో పడిపోయారు. ఆయన తీవ్ర గాయాలతోపాటు అపస్మారక స్థితికి చేరుకున్నారు. స్థానికులు తక్షణమే ఆసుపత్రికి తరలించినా, చికిత్స పొందుతూ ఆయన మృతిచెందారు.
వివరాలు
మంగళవారం అర్ధరాత్రి తర్వాత ఎన్‌ఆర్‌ఐ అమృత్‌పాల్ సింగ్ ధిల్లన్ అరెస్ట్
ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ కెమెరా ఫుటేజీల ఆధారంగా వాహనాన్ని గుర్తించారు. దాన్ని నడిపింది కెనడాలో నివసించే ఎన్‌ఆర్‌ఐ అమృత్‌పాల్ సింగ్ ధిల్లన్ అనే వ్యక్తి అని గుర్తించి, మంగళవారం అర్ధరాత్రి తర్వాత అతడిని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం భోగ్‌పుర్ ప్రాంతానికి చెందిన పనిమీద వచ్చి తిరిగి వెళ్తుండగా, ఫౌజా సింగ్‌ను తాను తెలియకుండానే ఢీకొట్టినట్లు అమృత్‌పాల్ విచారణలో ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే భయంతో అక్కడినుంచి పరారైనట్టు అతడు చెప్పినట్లు సమాచారం.
వివరాలు
ఫౌజా సింగ్ కు 'టర్బన్డ్ టోర్నడో' బిరుదు
పోలీసులు ఈ రోజు అమృత్‌పాల్‌ను కోర్టులో హాజరుపరచనున్నారు. 'టర్బన్డ్ టోర్నడో' అనే బిరుదుతో ఫౌజా సింగ్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. వందకు పైగా వయస్సున్నప్పటికీ అనేక మారథాన్ పరుగుల్లో చురుకుగా పాల్గొని ఎంతో మందికి ప్రేరణగా నిలిచారు. ఆయన అకాలమరణంపై ప్రధాని నరేంద్ర మోదీతో పాటు అనేక మంది ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ సంతాపం ప్రకటించారు.