
Oil Refinery: ఆంధ్రప్రదేశ్ కి గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రమంత్రి..రూ.80 వేల కోట్లతో రిఫైనరీ
ఈ వార్తాకథనం ఏంటి
పెట్రోలియం రంగంలో అనేక రాష్ట్రాల్లో పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయని, వీటిని వినియోగించుకునే విషయంలోఆంధ్రప్రదేశ్, గుజరాత్, ఒడిశా రాష్ట్రాలు ముందంజలో ఉన్నాయని కేంద్ర పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పూరీ తెలిపారు.
రాష్ట్రంలో రూ.80 వేల కోట్ల వ్యయంతో రిఫైనరీ నిర్మాణం జరుగుతుందని పేర్కొన్నారు.
ఒడిశాలోని పారాదీప్ వద్ద ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో రిఫైనరీ ఏర్పాటవుతోందని తెలిపారు.
ఈ నేపథ్యంలో ఒడిశా ప్రభుత్వం,ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ మధ్య ఒక ఒప్పందం కుదిరిందని వెల్లడించారు.
ఈ కార్యాచరణలో హర్దీప్ సింగ్ పురి స్వయంగా పాల్గొన్నారు.
వివరాలు
ముడి చమురు ధర బ్యారల్‌కు సుమారు 60 డాలర్లు
"గతంలో , మేము 27 దేశాల నుంచి మాత్రమే ముడి చమురును దిగుమతి చేసుకునేవాళ్లం. ఇప్పుడు మాత్రం 40 దేశాల నుంచి దిగుమతులు చేస్తున్నారు. చమురు ధరలు తగ్గినప్పుడు అధికంగా కొనుగోలు చేసి నిల్వలో ఉంచుతున్నాం. ప్రస్తుతం ముడి చమురు ధర బ్యారల్‌కు సుమారు 60 డాలర్ల వరకు ఉంది," అని కేంద్ర మంత్రి వివరించారు.