Page Loader
Omar Abdullah: ఒమర్ అబ్దుల్లాను అడ్డుకున్న పోలీసులు.. వీడియోను షేర్ చేసిన జమ్ము ముఖ్యమంత్రి 
ఒమర్ అబ్దుల్లాను అడ్డుకున్న పోలీసులు.. వీడియోను షేర్ చేసిన జమ్ము ముఖ్యమంత్రి

Omar Abdullah: ఒమర్ అబ్దుల్లాను అడ్డుకున్న పోలీసులు.. వీడియోను షేర్ చేసిన జమ్ము ముఖ్యమంత్రి 

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 14, 2025
05:27 pm

ఈ వార్తాకథనం ఏంటి

జమ్ముకశ్మీర్‌లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రతి సంవత్సరం జూలై 13న నిర్వహించే అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకుని సీఎం ఒమర్‌ అబ్దుల్లా అమర వీరులుకు నివాళులు అర్పించేందుకు యత్నించారు. ఈ సందర్భంగా స్థానికులు అమరవీరుల స్థూపంగా భావించే మజార్-ఎ-షుహదా వద్ద నివాళులు అర్పించేందుకు ఆయన వెళ్లారు. అక్కడి గోడ దూకి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించిన ఆయనను గవర్నర్‌ ఆదేశాల మేరకు అక్కడ మొహరించిన పోలీసులు అడ్డుకున్నారు. ఆయనను పక్కకు లాగిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ నేపథ్యంలో పోలీసుల వైఖరిపై సీఎం ఒమర్‌ అబ్దుల్లా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

వివరాలు 

డోగ్రా సైనికుల కాల్పుల్లో 21 మంది మృతి 

''నేను చట్టవిరుద్ధంగా ఏ పని చేయలేదు. మమ్మల్ని ఆపాలని ఏ చట్టంలో ఉంది? ఇది స్వేచ్ఛా దేశమని చెబుతారు. కానీ మమ్మల్ని బానిసల్లా చూస్తున్నారు. మేము ప్రజల సేవకులం. కానీ ఎవరి బానిసలం కాదు'' అని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, జూలై 13న జరుపుకునే అమరవీరుల దినోత్సవానికి చారిత్రక ప్రాధాన్యం ఉంది. బ్రిటీష్ ఇండియా కాలంలో 1931 జూలై 13న జమ్మూకశ్మీర్‌లో డోగ్రా సైనికుల కాల్పుల్లో 21 మంది ప్రాణాలు కోల్పోయారు. వారి స్మరణార్థంగా ప్రతి సంవత్సరం జూలై 13న ఈ దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించేవారు. ప్రభుత్వంతో పాటు ప్రతిపక్ష పార్టీలు కూడా మజార్-ఎ-షుహదా వద్ద నివాళులు అర్పించే సంప్రదాయం ఉంది.

వివరాలు 

 2020 నుంచి జూలై 13న సెలవు దినం రద్దు 

అధికారికంగా సీఎం ఆధ్వర్యంలో నివాళుల కార్యక్రమం నిర్వహించేవారు. ఈ కార్యక్రమాల్లో జమ్మూకశ్మీర్ పోలీసులు కూడా పాల్గొనడం సంప్రదాయం. అయితే 2019 ఆగస్టు 5న కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఆర్టికల్ 370ను రద్దు చేసిన తర్వాత పరిస్థుతులు మారాయి. ఆర్టికల్ 370 రద్దు చేసిన ఏడాది తరువాత, అంటే 2020 నుంచి జూలై 13న సెలవు దినాన్ని కూడా రద్దు చేశారు. అలాగే అధికారిక నివాళుల కార్యక్రమాన్ని కూడా నిలిపివేశారు. ఈ నేపథ్యంలో లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఆదేశాల మేరకు అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించేందుకు అనుమతి ఇవ్వలేదు. అయినప్పటికీ ఒమర్‌ అబ్దుల్లా నివాళులర్పించేందుకు వెళ్లడంతో అక్కడ ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఒమర్ అబ్దుల్లాహ్ చేసిన ట్వీట్