Amit Shah: మోదీ హయాంలో ఒకే దేశం, ఒకే ఎన్నికలు.. అమిత్ షా కీల ప్రకటన
హోంమంత్రి అమిత్ షా కీలక ప్రకటన చేశారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఎ ప్రభుత్వం ప్రస్తుత పదవీకాలంలోనే ఒక దేశం, ఒకే ఎన్నికల విధానాన్ని అమలు చేస్తామని మంగళవారం హోంమంత్రి తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ మూడోసారి అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తయిన సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అమిత్ షా మాట్లాడారు. ఈ ప్రభుత్వ హయాంలోనే ఒకే దేశం ఒకే ఎన్నికల విధానాన్ని తీసుకురావాలని ప్రణాళిక చేస్తున్నామని వివరించారు. వన్ నేషన్, వన్ ఎలక్షన్ గురించి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నిన్న రాహుల్ జోషి కూడా మాట్లాడారు. పాలసీ ఫ్రేమ్‌వర్క్ పై సంప్రదింపులు పూర్తయ్యాయని వెల్లడించారు.
దేశ వ్యాప్తంగా త్వరలో జనగణన
ఈ నేపథ్యంలో హోంమంత్రి అమిత్ షా తాజా వ్యాఖ్యలకు ప్రాధాన్యత సంతరించుకుంది. గత నెల స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోదీ ఈ ప్రస్తావన తీసుకొచ్చారు. రాజకీయ పార్టీలను ఏకకాల ఎన్నికల కోసం మద్దతు ఇవ్వాలని కోరారు. ఈ విధానం ద్వారా ఎన్నికల నిర్వహణలో సమయం, ఖర్చులు తగ్గుతాయని, మరియు అభివృద్ధి, పాలనలో స్థిరత్వం వస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. హోంమంత్రి అమిత్ షా జనాభా గణన ప్రకటన కూడా త్వరలోనే చేస్తామని చెప్పారు. 1881 నుంచి ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే జనాభా గణన 2021లో జరగాల్సి ఉన్నప్పటికీ, కరోనా మహమ్మారి కారణంగా ఆలస్యం అయిందని ఆయన తెలిపారు.