Page Loader
తెలంగాణలో ముస్లింల రిజర్వేషన్లను రద్దు చేస్తానన్న అమిత్ షాపై ఒవైసీ ఫైర్ 
తెలంగాణలో ముస్లింల రిజర్వేషన్లను రద్దు చేస్తానన్న అమిత్ షాపై ఒవైసీ ఫైర్

తెలంగాణలో ముస్లింల రిజర్వేషన్లను రద్దు చేస్తానన్న అమిత్ షాపై ఒవైసీ ఫైర్ 

వ్రాసిన వారు Stalin
Apr 24, 2023
01:52 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే ముస్లింలకు రిజర్వేషన్లు రద్దు చేస్తామన్న హామీపై కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై ఏఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు. వెనుకబడిన ముస్లింలను చేరదీయాలని ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతుండగా, వారి రిజర్వేషన్లను తొలగిస్తామని షా చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. వెనుకబడిన ముస్లిం వర్గాలకు రిజర్వేషన్లు డేటా ఆధారంగా ఉన్నాయని ఓవైసీ గుర్తు చేశారు. ఈ మేరకు అసదుద్దీన్ ఒవైసీ ట్వీట్ చేశారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు న్యాయం చేయడంపై బీజేపీ నిజాయితీగా ఉంటే, 50శాతం కోటా పరిమితిని తొలగించేందుకు రాజ్యాంగ సవరణను ప్రవేశపెట్టాలని ఒవైసీ అన్నారు.

ఒవైసీ

సుప్రీంకోర్టు స్టే ఆధారంగా ముస్లింలకు రిజర్వేషన్లు అమలు: ఒవైసీ 

తెలంగాణలో ముస్లిం రిజర్వేషన్ల అమలుపై దయచేసి సుధీర్ కమిషన్ నివేదిక చదవాలని ఒవైసీ పేర్కొన్నారు. సుప్రీంకోర్టు స్టే ఆధారంగా ముస్లింలకు రిజర్వేషన్లు కొనసాగుతున్నాయని షాకు ఒవైసీ గుర్తు చేశారు. హైదరాబాద్ సమీపంలోని చేవెళ్లలో జరిగిన బహిరంగ సభలో ఆదివారం సాయంత్రం అమిత్ షా ప్రసంగిస్తూ ముస్లింలకు రిజర్వేషన్లు రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. ముస్లింల కోటా రాజ్యాంగ విరుద్ధమని, రిజర్వేషన్ అనేది షెడ్యూల్డ్ కులాలు (ఎస్సీ) షెడ్యూల్డ్ తెగలు (ఎస్టీ), ఇతర వెనుకబడిన తరగతుల (ఓబీసీ) హక్కు అని షా అన్నారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముస్లిం రిజర్వేషన్‌ను తొలగించి, వాటిని ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు కల్పిస్తామని చెప్పారు.