వరి పంటకు వాతావరణ గండాలు.. అన్నదాతకు నీటి కటకటాలు
ఈ వార్తాకథనం ఏంటి
నానాటికీ భూ ఉష్ణోగ్రతలు పెరుగుతున్న కారణంగా వరికి గండాలు అదే స్థాయిలో హెచ్చుతోంది. ఈ కారణంగా కోట్లాది భారత ప్రజలకు కావాల్సిన ఆహారం, జీవనోపాధికి ముప్పు తప్పేలా కనిపించట్లేదు.
మరోవైపు ఆయా వరి పండించేందుకు కావాల్సిన సాగునీరు దొరకపోవడం, కీలక సమయాల్లో వరుణ దేవుడు చేతులెత్తేయడం అన్నదాతలను దిక్కుతోచని స్థితిలో నిలుపుతోంది.
భారత వ్యవసాయ రంగం 50 ఏళ్ల కిందట కరువును, ఆకలిని, ఎదుర్కొనేందుకు క్రాప్ ప్రొడక్షన్ ను భారీగా పెంచాల్సి వచ్చింది.
అయితే అప్పటి అవసరాలను అత్యధిక దిగుబడినిచ్చే హైబ్రిడ్ విత్తనాలు, రసాయన ఎరువులు (కెమికల్ ఫర్టిలైజర్స్) ఆ ఆవశ్యకతలను తీర్చేశాయి. కానీ దీర్ఘకాలంలో నేటికీ వరి పంటకు వాతావరణ పరిస్థితులు సంకటంలా మారిపోవడం గమనార్హం.
DETAILS
పంటలు చేతికి రాకపోవడానికి ఇలాంటి కారణాలెన్నో
ఒక్కోసారి అవసరం లేకపోయినా విపరీతమైన వానలు కురుస్తుంటాయి. మరోసారి సముద్రుడు పొంగితే ఆ నీరంతా చొచ్చుకొచ్చి పంటలను ముంచేస్తుంది. ఇక రాత్రి సమయాల్లోనూ వేడి ఉష్ణోగ్రతల కారణంగా దిగుబడులు క్రమేపి తగ్గిపోతున్నాయి.
అయితే వరి ఉత్పత్తికి కావాల్సిన నూతన పరిస్థితులు, వాటికి అవసరమయ్యే నూతన వ్యవసాయ విధానాలను సమకూర్చుకునేందుకు అన్నదాతలకు సవాళ్లు విసురుతున్నాయి. దీని కారణంగానే అన్నదాతలు తమ పంట కాలాలను మార్చుకుంటున్నారు.
వేడి వాతావరణాన్ని, ఉప్పు నేలల్ని సైతం తట్టుకునే విత్తనాల తయారీకి విస్త్తృత ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. సాగు నీటి వనరుల లభ్యత తక్కువున్న పొలాలకు నీరు ఏర్పాటు చేయకుండా కావాలనే ఆయా రైతులు ఎండబెడుతున్నారు.
DETAILS
ప్రపంచ వ్యాప్తంగా వరి పంటకు కటకటే
వర్ష బీభత్సాల కారణంగా గడిచిన 20 ఏళ్లలో చైనా దేశంలో వరి దిగుబడి కుదేలైంది. మరోవైపు భారత్ తన సొంత వినియోగాన్ని దృష్టిలో పెట్టుకొని బియ్యం ఎగుమతులను తగ్గించుకుంది.
ఇక పాకిస్థాన్‌లో అయితే ఉష్ణోగ్రతల పెరుగుదల, ఆకస్మిక వరదలు పంటలను తీవ్రంగా ధ్వంసం చేశాయి. వాతావరణంలో చోటు చేసుకుంటున్న పెను మార్పుల వల్ల ధాన్యం ఉత్పత్తి ప్రపంచవ్యాప్తంగా తగ్గిపోయే ప్రమాదం ఉందని తెలుస్తోంది.
అయితే ప్రపంచ ధాన్యాగారంగా పేరుగాంచిన వియత్నాం దేశంలోని మెకాంగ్ డెల్టాలో దాదాపు రెండున్నర లక్షల ఎకరాలను వరి ఉత్పత్తి నుంచి తప్పిస్తూ ఆ దేశ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
మెకాంగ్ డెల్టాలో ఏటా 3 పంటలు పండిస్తూ ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల ఆకలిని అక్కడి రైతులు తీర్చారు.