
Modi-Rajnath Singh: పహల్గాం దాడి.. భద్రతా అంశాలపై ప్రధానితో రాజ్‌నాథ్ కీలక సమావేశం
ఈ వార్తాకథనం ఏంటి
పహల్గాం దాడి కారణంగా భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి.
ఉగ్రవాదాన్ని పెంచి పోషించే పాకిస్థాన్‌కు గుణపాఠం చెప్పేందుకు న్యూదిల్లీ సిద్ధమవుతోంది.
ఈ నేపథ్యంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సోమవారం ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు.
పహల్గాంలో పరిస్థితులు, భద్రతా సన్నద్ధతపై సైన్యం తీసుకున్న నిర్ణయాలను ఆయన ప్రధానికి వివరించారు. ఈ సమావేశం దాదాపు 40 నిమిషాలు కొనసాగింది
Details
సైన్యంతో సమావేశం
పహల్గాంలో జరిగిన దాడి నేపథ్యంలో భారత్ తీసుకోవాల్సిన చర్యలపై చర్చించేందుకు రక్షణ మంత్రి ఆదివారం సైన్యం ప్రధాన అధికారితో, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహన్‌తో సమావేశమయ్యారు.
ఈ సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వాటిని సోమవారం, రాజ్‌నాథ్ ప్రధాని మోదీకి వివరించారు.
ఈ భేటీలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ఢోబాల్ కూడా పాల్గొన్నారు.
Details
పార్లమెంట్ సమావేశం
మరోవైపు, రక్షణ వ్యవహారాలపై పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ కూడా సోమవారం భేటీ అవుతుందని సమాచారం.
ఈ భేటీ పార్లమెంట్ హౌస్‌లో మధ్యాహ్నం 3 గంటలకు జరగనున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి.
పహల్గాం దాడితో సరిహద్దుల్లో అల్లర్లు పెరిగిన నేపథ్యంలో, పాక్ ముందస్తు చర్యలు తీసుకుంటోంది. పాక్ వైపు నుంచి దాడి ఎదురవ్వొచ్చని భావించి, సరిహద్దుల్లో అదనపు బలగాలను మోహరించారు.
ఈ నేపథ్యంలో, పాకిస్థాన్‌లో ప్రస్తుతం తుర్కియే సీ-130 హెర్క్యులస్ విమానాలు ల్యాండ్ అయ్యాయి. ఈ విమానాల్లో సైనిక ద్రవ్యాలను తీసుకువచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.