
కశ్మీర్ సరిహద్దులో బెలూన్ కలకలం.. పాకిస్థాన్ పైనే అనుమానం
ఈ వార్తాకథనం ఏంటి
భారత్ పాక్ సరిహద్దుల్లో పాకిస్థాన్ దేశానికి చెందిన ఓ విమానం ఆకారపు బెలూన్ కలకలం సృష్టించింది. జమ్మూ కాశ్మీర్‌లోని కథువా జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. బెలూన్ పై పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ ( పీఐఏ ) పేరిట ఓ లోగో కనిపించడం గమనార్హం.
జిల్లాలోని హీరానగర్‌లో బ్లాక్ అండ్ వైట్ రంగులో కనిపించిన ఈ మిస్టరీ బెలూన్ నేలపై పడి ఉండటం భద్రతా బలగాల ఆలోచనలకు మరింత పరీక్ష పెడుతోంది.
బెలూన్‌ను స్వాధీనం చేసుకున్న పారామిలటరీ దళాలు బెలూన్ పూర్తి వివరాలపై ఆరా తీస్తున్నారు. అసలు ఈ బెలూన్ ఇక్కడికి ఎలా వచ్చింది, ఎవరు ప్రయోగించారనే కోణంలో ఇప్పటికే దర్యాప్తును ప్రారంభించాయి.
పాక్
పాక్ డ్రోన్‌లను అడ్డుకున్న బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్
తాజాగా కశ్మీర్ రాజౌరీలో భీకర ఎన్‌కౌంటర్ జరిగింది. దాని ఫలితంగా భద్రతా బలగాల చేతిలో ఓ ఉగ్రవాది మరణించాడు.
2023 ఫిబ్రవరిలో సిమ్లా పరిధిలోని ఆపిల్ తోటలో ఓ విమానం ఆకారంలో ఉన్న వైట్ అండ్ గ్రీన్ కలర్ బెలూన్ ను దళాలు గుర్తించాయి. సదరు బెలూన్ పై పాక్ విమానయాన సంస్థ చిహ్నం సైతం ముద్రించారు.
మరోవైపు మే 20న పంజాబ్ అమృత్‌సర్‌లో పాక్ కు చెందిన డ్రోన్‌ను సైతం కూల్చిశారు. ఈ సందర్భంగా కనిపించిన మత్తుపదార్థాలు ఉన్న ఓ బ్యాగ్‌ను స్వాధీనం చేసుకున్నట్లు సరిహద్దు భద్రతా దళాల సిబ్బంది వెల్లడించారు.
అంతకు ముందు రోజే నాలుగు పాక్ డ్రోన్‌లను బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అడ్డుకోవడం కొసమెరుపు.