LOADING...
Operation Sindoor: సోషల్ మీడియాలో పాకిస్థాన్ 'ఫేక్ న్యూస్' వార్.. వాస్తవాలతో స్పందించిన భారతదేశం 
సోషల్ మీడియాలో పాకిస్థాన్ 'ఫేక్ న్యూస్' వార్.. వాస్తవాలతో స్పందించిన భారతదేశం

Operation Sindoor: సోషల్ మీడియాలో పాకిస్థాన్ 'ఫేక్ న్యూస్' వార్.. వాస్తవాలతో స్పందించిన భారతదేశం 

వ్రాసిన వారు Sirish Praharaju
May 07, 2025
09:04 am

ఈ వార్తాకథనం ఏంటి

పహల్గాం ప్రాంతంలో పర్యాటకులపై జరిగిన దారుణ ఉగ్రదాడికి భారత్‌ గట్టిగా ప్రతీకారం తీర్చుకుంది. ఈ దాడికి బదులుగా, భారత సైన్యం పాకిస్థాన్‌ ఆక్రమిత భూభాగంలోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని 'ఆపరేషన్‌ సిందూర్‌' పేరిట మెరుపుదాడులు జరిపింది. ఈ ఆపరేషన్‌ విజయవంతమైందని భారత సైన్యం అధికారికంగా ప్రకటించింది. ఈ దాడులతో పాకిస్థాన్‌ తీవ్ర ఆందోళనకు లోనైంది. వెంటనే సోషల్‌ మీడియాలో తప్పుడు వార్తలు వ్యాపింపజేయడం ప్రారంభించింది. అయితే, భారత్‌ దీనిపై నిర్ధారణ చేసిన తర్వాత వాటిని పూర్తిగా తిప్పికొట్టి వాస్తవాలను ప్రజల ముందు ఉంచింది.

వివరాలు 

తప్పుడు వీడియోలతో పాకిస్థాన్‌ ప్రపంచాన్ని మోసం చేయాలని ప్రయత్నం 

భారతసైన్యం స్థావరాలను తాము ధ్వంసం చేశామని పాకిస్థాన్‌ ఆర్మీ తరఫున కొన్ని సోషల్‌ మీడియా ఖాతాలు ప్రచారం చేయడం మొదలుపెట్టాయి. ఈనేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఫ్యాక్ట్‌ చెక్‌ నిర్వహించి వాటి వెనుక ఉన్న వాస్తవాన్ని బయటపెట్టింది. ప్రభుత్వ ప్రకటన ప్రకారం,పాక్‌ ప్రచారం చేస్తున్న వీడియోలన్నీ పాతవే. అవిభారత్‌కు సంబంధించినవే కాదు.2024లో ఖైబర్‌ పఖ్తుంఖ్వా ప్రాంతంలో జరిగిన ఘర్షణల దృశ్యాలను,ఐర్లాండ్‌లో జరిగిన మరో ఘటనల క్లిప్పింగులను ఉద్దేశపూర్వకంగా భారత సైన్యం స్థావరాలపై దాడులుగా చూపిస్తూ ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తోంది. ఈనేపథ్యంలో భారత ప్రభుత్వం ప్రజలకు ఒక హెచ్చరిక జారీ చేసింది. "సోషల్‌ మీడియాలో ప్రచారం చేస్తున్నతప్పుడు సమాచారం పట్ల అప్రమత్తంగా ఉండండి.నిజం తెలుసుకోకుండా వాటిని నమ్మవద్దు,"అని కేంద్రం స్పష్టం చేసింది.