
Golden Temple: పంజాబ్‌లోని స్వర్ణ దేవాలయాన్ని టార్టెట్ చేసిన పాక్.. భారత వైమానిక రక్షణ ఎలా కాపాడిందంటే?
ఈ వార్తాకథనం ఏంటి
పహల్గాం ఉగ్రదాడికి ప్రతిగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ ద్వారా బలమైన ప్రతిచర్య తెలిపిన విషయం తెలిసిందే.
మే 7వ తేదీన భారత్ పాకిస్థాన్,పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో ఉన్న సుమారు తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై మిస్సైళ్లతో భీకరంగా దాడి చేసింది.
ఈ మిస్సైల్ దాడుల్లో ఆయా ఉగ్ర కేంద్రాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. అంతేకాకుండా, ఈ దాడుల్లో వందకు పైగా ఉగ్రవాదులు హతమయ్యారు.
ఈ ఘటనల తర్వాత పాకిస్తాన్ కూడా భారతపై ప్రతిదాడులకు ప్రయత్నించిన విషయం తెలిసిందే.
వివరాలు
మిస్సైళ్లు, డ్రోన్లతో లక్ష్యం
ఈ నేపథ్యంలో పంజాబ్‌లోని అమృత్‌సర్ ప్రాంతంలో ఉన్న విశ్వ ప్రసిద్ధిగాంచిన స్వర్ణ దేవాలయాన్ని టార్గెట్‌గా చేసేందుకు మిస్సైళ్లు,డ్రోన్లను ఉపయోగించేందుకు యత్నించిందని 15వ ఇన్‌ఫాంట్రీ డివిజన్‌కు చెందిన జనరల్ ఆఫీసర్ కమాండింగ్ (జీఓసీ) మేజర్ జనరల్ కార్తీక్ సి శేషాద్రి సోమవారం వెల్లడించారు.
అయితే, భారత ఆర్మీకి చెందిన వైమానిక రక్షణ విభాగం అటువంటి దాడులను సమర్థవంతంగా అడ్డుకుంది అని ఆయన స్పష్టం చేశారు.
భారత సైన్యం చేసిన ఉగ్ర స్థావరాలపై దాడులు పాక్‌ను తీవ్రమైన ఒత్తిడిలోకి నెట్టాయని,దాంతోనే వారు భారత్‌లోని పలు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకునే యత్నం చేశారని చెప్పారు.
వివరాలు
స్వర్ణ దేవాలయానికి సంపూర్ణ స్థాయిలో వైమానిక రక్షణ ఏర్పాటు
ముఖ్యంగా భారతదేశంలోని సైనిక స్థావరాలు, నివాస ప్రాంతాలు, పూజా స్థలాలు వారు టార్గెట్ చేయవచ్చని ముందుగానే భారత సైన్యం అంచనా వేసినట్లు పేర్కొన్నారు.
ఇందులో స్వర్ణ దేవాలయం ఎంతో ప్రతిష్ఠాత్మకమైన ప్రదేశమైందిగా పరిగణించి, అక్కడ సంపూర్ణ స్థాయిలో వైమానిక రక్షణ ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు.