LOADING...
Parliament: లోక్‌సభ ఒంటిగంట వరకు,రాజ్యసభ 2 గంటల వరకు వాయిదా
లోక్‌సభ ఒంటిగంట వరకు,రాజ్యసభ 2 గంటల వరకు వాయిదా

Parliament: లోక్‌సభ ఒంటిగంట వరకు,రాజ్యసభ 2 గంటల వరకు వాయిదా

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 28, 2025
12:44 pm

ఈ వార్తాకథనం ఏంటి

పార్లమెంట్‌లో ఉభయ సభలు వాయిదాల పర్వం కొనసాగుతోంది. వర్షాకాల సమావేశాలు ప్రారంభమై ఇప్పటికే ఆరు రోజులు గడిచినా, ఇప్పటివరకు ఎలాంటి చర్చలు జరగలేదు. లోక్‌సభ, రాజ్యసభ రెండూ కూడా ప్రతిరోజూ వాయిదాలు పడుతూనే ఉన్నాయి. ఈ రోజు సోమవారం, కేంద్ర ప్రభుత్వం 'ఆపరేషన్‌ సిందూర్‌'పై లోక్‌సభలో చర్చ నిర్వహించబోతోందని ప్రకటించింది. అయినప్పటికీ, ప్రతిపక్ష సభ్యులు తమ నిరసన కార్యక్రమాలను ఆపకుండా కొనసాగిస్తున్నారు.

వివరాలు 

ప్రతిపక్ష సభ్యుల వ్యవహారంపై లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా తీవ్ర అసంతృప్తి

ఈ పరిస్థితుల మధ్య ఉదయం 11 గంటలకు ప్రారంభమైన ఉభయ సభలు, మొదట మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. అయితే, తరువాత కూడా పరిస్థితి మారకపోవడంతో, లోక్‌సభను మధ్యాహ్నం ఒంటిగంట వరకు, రాజ్యసభను మధ్యాహ్నం రెండు గంటల వరకు మళ్లీ వాయిదా వేశారు. వాయిదాకు ముందు, ప్రతిపక్ష సభ్యుల వ్యవహారంపై లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. బిజినెస్‌ అడ్వైజరీ కమిటీ సమావేశంలో 'ఆపరేషన్‌ సింధూర్‌'పై చర్చకు అంగీకరించిన ప్రతిపక్ష సభ్యులు, ఇప్పుడు అదే అంశంపై ఎందుకు ఆందోళన చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు.