Page Loader
ఆంధ్రప్రదేశ్: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు ఏపీ మహిళా కమిషన్ నోటీసులు
ఆంధ్రప్రదేశ్: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు ఏపీ మహిళా కమిషన్ నోటీసులు

ఆంధ్రప్రదేశ్: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు ఏపీ మహిళా కమిషన్ నోటీసులు

వ్రాసిన వారు Stalin
Jul 10, 2023
06:11 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్‌లో మహిళల మిస్సింగ్‌‌పై జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తున్నాయి. ఏపీలో మహిళల మిస్సింగ్‌కు వాలంటీర్లే కారణమని ఏలూరులో నిర్వహించిన సభలో పవన్ కళ్యాణ్ అన్నారు. అయితే మహిళల మిస్సింగ్ అంశాన్ని ఏపీ మహిళా కమిషన్ సీరియస్‌గా తీసుకుంది. పవన్ కళ్యాణ్‌కు నోటీసులు జారీ చేసింది. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు మహిళల భద్రతకు ముప్పు అని ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ పేర్కొన్నారు. వాలంటీర్లపై పవన్ విషం చిమ్ముతున్నారని ఆమె అన్నారు. రాజకీయాల కోసం పవన్ దిగజారుతున్నారని వాసిరెడ్డి పద్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పిపోయిన మహిళల గురించి ఏ అధికారి చెప్పారో చెప్పాలని డిమాండ్ చేశారు.

పవన్

14వేల మంది ఆచూకీ ఇప్పటికీ తెలియదు: పవన్

వారాహి విజయయాత్రలో భాగంగా ఆదివారం ఏలూరులో పవన్‌కల్యాణ్‌ మాట్లాడుతూ.. రాష్ట్రంలో మహిళల అదృశ్యం, అక్రమ రవాణా వెనుక వైఎస్సార్‌సీపీ నేతల హస్తం ఉందని, వాలంటీర్లు దీని వెనుక ఉన్నారని ఆరోపించారు. వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం ప్రతి గ్రామంలో వాలంటీర్ల సాయంతో కుటుంబంలో ఎంత మంది ఉన్నారు, అందులో ఎంతమంది మహిళలు, వితంతువులు ఉన్నారనే లెక్కలను సేకరిస్తున్నారని పవన్ పేర్కొన్నారు. వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం హయాంలో అదృశ్యమైన 30 వేల మందిలో 14వేల మంది ఆచూకీ ఇప్పటికీ తెలియలేదని అన్నారు. రాష్ట్రంలో మహిళలు అదృశ్యం కావడానికి వాలంటీర్లే కారణమని ఆయన అన్నారు.