
PM Modi: అమరావతి నిర్మాణాల పునః ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ షెడ్యూల్ ఖరారు
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పనుల పునఃప్రారంభానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ షెడ్యూల్ ఖరారైంది.
మే 2వ తేదీ సాయంత్రం 4 గంటలకు ఆయన ఈ నిర్మాణ కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించనున్నారు.
ఈ సందర్బంగా, రాష్ట్ర ప్రభుత్వం సచివాలయం వెనక భాగంలో బహిరంగ సభ నిర్వహించేందుకు వేదికను ఎంపిక చేసింది.
అదే ప్రదేశంలో నిర్మాణ పనుల పునఃప్రారంభ వేడుకను నిర్వహించనున్నారు.
ఈ కార్యక్రమానికి ఉమ్మడి గుంటూరు, కృష్ణా, ప్రకాశం మరియు పశ్చిమ గోదావరి జిల్లాల ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యేలా కార్యాచరణ రూపొందించబడింది.
ప్రధాని పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక మంత్రుల కమిటీని ఏర్పాటు చేసింది.
వివరాలు
పకడ్బందీ ఏర్పాట్లకు అధికారులకు ఆదేశం
భద్రతా చర్యలు మరింత బలపరిచే ఉద్దేశ్యంతో, ఎస్పీజీ (SPG) బృందం భద్రతా ఏర్పాట్లను నిఘా పెట్టుతోంది.
ఇక మరోవైపు, ఈ కార్యక్రమానికి సుమారు ఐదు లక్షల మంది ప్రజలు హాజరయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్, పర్యటన నోడల్ అధికారి వీరపాండ్యన్ అధికారులు సంబంధిత అధికారులకు పలు సూచనలు జారీ చేశారు.
సభ ప్రాంగణానికి ప్రజలు, ప్రముఖులు సులభంగా చేరుకునేలా తొమ్మిది రహదారులను గుర్తించినట్టు తెలిపారు.
ఆయా రహదారులపై ట్రాఫిక్‌కు ఎలాంటి అంతరాయం కలగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.