
PM Modi: "డిజిటల్ అరెస్టులు, డీప్ ఫేక్‌లపై దృష్టి పెట్టండి".. డీజీపీలు, ఐజీపీల సదస్సులో ప్రధాని మోదీ
ఈ వార్తాకథనం ఏంటి
డిజిటల్ మోసాలు, సైబర్ నేరాలు, కృత్రిమ మేధస్సు (ఏఐ) సాంకేతికతల ద్వారా జరుగుతున్న అక్రమాలపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
డీప్ ఫేక్‌ల వంటి సాంకేతికతలు సామాజిక, కుటుంబ సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.
భువనేశ్వర్‌లోని లోక్‌సేవా భవన్ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన డీజీపీలు, ఐజీపీల మూడు రోజుల సదస్సు ముగింపు రోజు ఆదివారం నాడు ప్రధాన మంత్రి మాట్లాడారు.
కానిస్టేబుళ్ల స్థాయిలో సాంకేతికతను ఉపయోగించి వారి పని భారాన్ని తగ్గించేలా చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు.
వివరాలు
స్మార్ట్ పోలీసింగ్‌ను అనుసరించడంపై ప్రత్యేకంగా దృష్టి
ఈ సదస్సులో దేశ భద్రతకు సంబంధించిన వివిధ అంశాలపై చర్చ జరిగింది.
ముఖ్యంగా ఉగ్రవాదం, మావోయిస్టు కార్యకలాపాల నియంత్రణ, సైబర్ నేరాల తగ్గింపు, మహిళలపై హింసా చర్యల నిరోధకానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకున్నారు.
అంతేకాకుండా, జల మార్గాల్లో సమర్థ బందోబస్తుకు సంబంధించి కూడా తీర్మానాలు జరిపారు.
సైబర్ నేరాలను నియంత్రించడం కోసం ప్రత్యేక యుద్ధ ప్రణాళికగా పోలీసు శాఖ చర్యలు చేపట్టాలని ప్రధాన మంత్రి పిలుపునిచ్చారు. స్మార్ట్ పోలీసింగ్‌ను అనుసరించడంపై ప్రత్యేకంగా దృష్టి సారించారు.
ఈ 59వ సదస్సులో 250 మంది అధికారులు ప్రత్యక్షంగా, మరో 750 మంది వర్చువల్‌గా హాజరయ్యారు.
కేంద్ర హోం మంత్రి అమిత్ షా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.