
Mallikarjun Kharge: ఉగ్రవాద దాడిపై నిఘా వర్గాల నివేదిక.. ప్రధాని మోదీ కాశ్మీర్ పర్యటన రద్దు ఎందుకు భద్రత కల్పించలేదు..?: ఖర్గే
ఈ వార్తాకథనం ఏంటి
పహల్గాం ఉగ్రదాడి ఘటనపై కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే.
జమ్ముకశ్మీర్‌లో జరిగిన ఉగ్రదాడికి సంబంధించి తగినంత భద్రత ఎందుకు కల్పించలేదని ఆయన ప్రశ్నించారు.
'సంవిధాన్ బచావో'పేరిట రాంచీలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ఈవ్యాఖ్యలు చేశారు.
దేశంలో నెలకొన్న పరిస్థితులు అందరికీ తెలిసిన విషయమేనని వ్యాఖ్యానించిన ఖర్గే, పహల్గాం ఉగ్రదాడికి సంబంధించి నిఘా వైఫల్యం ఉందని ప్రభుత్వం కూడా అంగీకరించిందని గుర్తు చేశారు.
కేంద్రం ఇంటెలిజెన్స్ వ్యవస్థను బలోపేతం చేస్తామంటూ హామీ ఇచ్చిందని,దాడికి మూడు రోజుల ముందు నుంచే కీలకమైన నిఘా సమాచారం వచ్చిందన్న విషయాన్ని తనకు తెలుసని తెలిపారు.
అలాంటప్పుడు ఎందుకు పహల్గాంలో ముందస్తుగా సమర్థవంతమైన భద్రతా ఏర్పాట్లు చేయలేకపోయారని ప్రశ్నించారు.
వివరాలు
మోదీ పాలన తీరుపైనా తీవ్రస్థాయిలో విమర్శలు
పహల్గాం దాడికి ప్రతిస్పందనగా పాకిస్థాన్‌పై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకున్నా, ఆ చర్యలకు కాంగ్రెస్ పూర్తి మద్దతు ఉంటుందని ఖర్గే స్పష్టం చేశారు.
రాజకీయ పార్టీలు వేర్వేరు అయినా, దేశ భద్రత విషయంలో అందరూ ఐక్యంగా ఉండాలని ఆయన అన్నారు.
జాతీయ సమైక్యతకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఇక ప్రధాని మోదీ పాలన తీరుపైనా తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వరంగ సంస్థలను ఒకదాని తర్వాత ఒకదాన్ని మూసివేస్తూ ముందుకెళ్తోందని ఆరోపించారు.
అదే మోదీ పాలనా విధానమని వ్యాఖ్యానించారు.
అదేవిధంగా, ఆదివాసీ నాయకులను భయపెట్టే విధానాన్ని అవలంబించకూడదని కేంద్రానికి హితవు పలికారు.