
PM Modi: సీడీఎస్, రక్షణమంత్రి, ఎన్‌ఎస్‌ఏలతో ప్రధాని మోదీ కీలక సమావేశం
ఈ వార్తాకథనం ఏంటి
పహల్గాం దాడి తర్వాత సరిహద్దు ప్రాంతాల్లో ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో, దేశ రాజధాని ఢిల్లీలోను కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ నివాసంలో అత్యంత ముఖ్యమైన సమావేశం నిర్వహించారు.
ఈ సమాలోచనలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) అనిల్ చౌహాన్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌తో పాటు, త్రివిధ దళాధిపతులు, ఇతర ఉన్నత స్థాయి అధికారులు హాజరయ్యారు.
సమావేశంలో దేశ అంతర్గత భద్రతా పరిస్థితులు,రిహద్దుల్లో నెలకొన్న తాజా పరిణామాలపై లోతుగా చర్చించినట్లు సమాచారం.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ప్రధాని మోదీ కీలక సమావేశం
PM Modi chairs a meeting with Defence Minister, NSA, CDS and chiefs of all the Armed Forces. pic.twitter.com/fr9y5eVbet
— ANI (@ANI) April 29, 2025
వివరాలు
పారామిలిటరీ దళాల హై లెవెల్ సమీక్ష
అంతకముందు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన పారామిలిటరీ దళాల ఓ హై లెవెల్ సమీక్ష సమావేశం జరిగింది.
ఈ సమావేశానికి BSF, SSG, అసోం రైఫిల్స్ కు చెందిన ఉన్నతాధికారులు హాజరయ్యారు. సుమారుగా 40 నిమిషాల పాటు కొనసాగిన ఈ సమావేశంలో పహల్గాం ఉగ్రదాడి అనంతర పరిణామాలపై విస్తృతంగా చర్చలు జరిగినట్లు సమాచారం.
ఈ సమావేశంలో కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ కూడా పాల్గొన్నారు.
మరోవైపు, ఈ సంఘటనల నేపథ్యంగా కేంద్ర హోంశాఖతో పాటు ప్రధాని నరేంద్ర మోదీ కూడా త్రివిధ దళాల ఉన్నతాధికారులతో ప్రత్యేకంగా సమావేశమై, భద్రతాపరంగా కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు సమాచారం.