LOADING...
Kartavya Bhavan: కేంద్ర పాలనకు కేంద్రబిందువు.. కర్తవ్య భవన్‌‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ
కేంద్ర పాలనకు కేంద్రబిందువు.. కర్తవ్య భవన్‌‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ

Kartavya Bhavan: కేంద్ర పాలనకు కేంద్రబిందువు.. కర్తవ్య భవన్‌‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 06, 2025
01:16 pm

ఈ వార్తాకథనం ఏంటి

సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన అత్యంత ప్రతిష్టాత్మక కర్తవ్య భవన్‌ను భారత ప్రధాని నరేంద్ర మోదీ అధికారికంగా ప్రారంభించారు. ఈ కొత్త భవనంలో కేంద్ర మంత్రుల కార్యాలయాలను దశల వారిగా మార్చే ప్రక్రియ మొదలైంది. ప్రస్తుతం నార్త్ బ్లాక్‌లో ఉన్న హోంశాఖ,విదేశాంగశాఖల కార్యాలయాలు కర్తవ్య భవన్‌కు మార్చారు. ఈ కార్యాలయాల్లో ఏర్పాట్లను ప్రధాని మోదీ స్వయంగా పరిశీలించారు.

వివరాలు 

పార్లమెంటు భవనంతో మొదలైన మార్పు

భారతదేశ పాలన చరిత్రలో ప్రధానమైన పాత్ర పోషించిన కొన్ని పురాతన భవనాలు ఇప్పుడు తమ స్థలాలను కొత్త కట్టడాలకు మారుస్తున్నాయి. ఇటీవల నిర్మించిన నూతన పార్లమెంటు భవనంతో మొదలైన ఈ మార్పు కొనసాగుతోంది. దశాబ్దాల చరిత్ర కలిగిన రాతి భవనాలను విడిచి,ఆధునిక సదుపాయాలతో కూడిన కాంక్రీట్ భవనాల్లోకి ప్రభుత్వ కార్యాలయాలు ప్రవేశిస్తున్నాయి. ఈ క్రమంలో ఢిల్లీలో కొత్తగా తీర్చిదిద్దిన కర్తవ్య భవన్‌కు ప్రధాని మోదీ శుభారంభం చేశారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

కర్తవ్య భవన్‌‌ను ప్రారంభిస్తున్న ప్రధాని మోదీ

వివరాలు 

ఆరంతస్తుల భవనం సుమారు 1.5 లక్షల చదరపు మీటర్ల విస్తీర్ణంలో..

ఇప్పటివరకు రైసీనా హిల్స్‌లో నార్త్ బ్లాక్, సౌత్ బ్లాక్‌లలో ఉన్న ప్రధాన కార్యాలయాలు.. వాటిలో ప్రధాని కార్యాలయం, రక్షణ, విదేశాంగ, ఆర్థిక, హోంశాఖల మంత్రిత్వ శాఖలు ముఖ్యమైనవి.. త్వరలో అక్కడి నుంచి ఖాళీ చేయబడి కర్తవ్య భవన్‌కు తరలించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మార్పు అనంతరం కర్తవ్య భవన్‌ కేంద్ర ప్రభుత్వ ప్రధాన మంత్రిత్వ శాఖలకూ కేంద్రబిందువుగా మారనుంది. ఈ ఆరంతస్తుల భవనం సుమారు 1.5 లక్షల చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించబడింది. ఇందులో ప్రధానంగా హోంశాఖ, విదేశాంగ శాఖలకు కార్యాలయాలు ఏర్పాటు చేయబడ్డాయి. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ భవనంలో ఆధునిక సదుపాయాలన్నీ సమకూర్చబడ్డాయి. ఇప్పటికే నార్త్ బ్లాక్ నుంచి హోంశాఖ కార్యాలయం ఈ కొత్త భవనానికి తరలింపు జరగుతోంది.

వివరాలు 

కర్తవ్య భవన్‌లో మొత్తం 67 సమావేశ గదులు

కర్తవ్య భవన్‌లో 24 పెద్ద సమావేశ గదులు, 26 చిన్న సమావేశ గదులు కలిపి మొత్తం 67 సమావేశ గదులు ఉన్నాయి. అలాగే 27 లిఫ్ట్‌లు ఏర్పాటు చేయబడ్డాయి. విదేశాంగ శాఖతో పాటు గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ, సూక్ష్మ చిన్న మధ్యతరహా సంస్థల (MSME) మంత్రిత్వ శాఖ, సిబ్బంది, శిక్షణ శాఖ, పెట్రోలియం & సహజ వాయువు మంత్రిత్వ శాఖ, అలాగే ప్రధాన శాస్త్రీయ సలహాదారు కార్యాలయాలు కూడా ఈ భవనంలో కార్యనిర్వహణ జరపనున్నాయి.