LOADING...
PM Modi: సౌదీ అరేబియాకు బయల్దేరి వెళ్లిన మోదీ.. రెండు రోజుల పాటు వివిధ కార్యక్రమాలకు హాజరు
సౌదీ అరేబియాకు బయల్దేరి వెళ్లిన మోదీ.. రెండు రోజుల పాటు వివిధ కార్యక్రమాలకు హాజరు

PM Modi: సౌదీ అరేబియాకు బయల్దేరి వెళ్లిన మోదీ.. రెండు రోజుల పాటు వివిధ కార్యక్రమాలకు హాజరు

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 22, 2025
10:10 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత దేశ ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల పర్యటన నిమిత్తం సౌదీ అరేబియాకు పయనమయ్యారు. ఆయన ఢిల్లీ నగరంలో నుంచి జెడ్డా నగరానికి విమాన మార్గంలో చేరుకోనున్నారు. సౌదీ అరేబియా ప్రధాని మహమ్మద్ బిన్ సల్మాన్ అందించిన ఆహ్వానాన్ని స్వీకరించి మోదీ ఈ పర్యటన చేపట్టారు. పర్యటనలో భాగంగా వివిధ కీలక సమావేశాలు, కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఇటీవలికాలంలో భారత్-సౌదీ అరేబియా మధ్య ఉన్న ద్వైపాక్షిక సంబంధాలు బలమైన మైత్రీకి నిదర్శనంగా నిలిచాయి. ఈ పర్యటన సందర్భంగా ఆ సంబంధాలను మరింత మెరుగుపరిచే అంశాలపై ఇరుదేశాల మధ్య చర్చలు జరగనున్నాయి. అదేవిధంగా, అక్కడ నివసిస్తున్న భారతీయులతో మోదీ ప్రత్యక్షంగా మాట్లాడే అవకాశం కూడా ఉంది.

వివరాలు 

 ఈ పర్యటనకు ప్రాధాన్యత 

ఇదే కాక,మోదీ మూడవసారి ప్రధాని పదవిని చేపట్టిన తరువాత సౌదీలో జరుగుతున్న ఆయన మొదటి పర్యటన ఇది. అంతకు ముందు 2016,2019సంవత్సరాల్లో ఆయన సౌదీ అరేబియాను సందర్శించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మళ్లీ అధికార బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయన మరోసారి అక్కడికి వెళ్లారు. ప్రపంచ వ్యాప్తంగా ఉద్రిక్తతలు నెలకొన్న ప్రస్తుత నేపథ్యంలో ఈ పర్యటనకు ప్రాధాన్యత పెరిగింది. ముఖ్యంగా అమెరికా,ఇరాన్ దేశాల మధ్య అణుశక్తి ఒప్పందం సంబంధించి మూడవ పాక్షిక ఒత్తిడులు పెరుగుతుండగా,మరోవైపు హమాస్-ఇజ్రాయెల్ మధ్య తలెత్తిన సైనిక ఘర్షణలు తీవ్ర రూపం దాల్చిన నేపథ్యంలో మోదీ పశ్చిమాసియా పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇదే సమయంలో వచ్చే నెలలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైతం సౌదీ అరేబియాను సందర్శించనున్నట్టు సమాచారం.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

నరేంద్ర మోదీ  చేసిన ట్వీట్