
Amaravati: అమరావతికి వెళ్లే ప్రజలకు ప్రత్యేక ఆహార ఏర్పాట్లు.. మూడు పూటలా ప్రత్యేక వంటకాలు.. వివరాలు ఇవే..
ఈ వార్తాకథనం ఏంటి
అమరావతిలో పునర్నిర్మాణ కార్యక్రమాలను ప్రారంభించేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈరోజు రాష్ట్ర పర్యటనకు రానున్నారు.
మధ్యాహ్నం 2.55 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకోనున్న ఆయన, సాయంత్రం 4.55 గంటల వరకు అమరావతిలో పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు.
ఈ సందర్బంగా, అమరావతిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించనున్నారు.
ఈ భారీ సభకు రాష్ట్రవ్యాప్తంగా సుమారు ఐదు లక్షల మంది ప్రజలను తరలించేందుకు కూటమి ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసింది.
సభకు హాజరయ్యే ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రభుత్వం పలు చర్యలు చేపట్టింది.
ప్రత్యేకంగా మూడు పూటల భోజనంతో పాటు, వేసవి తీవ్రత దృష్టిలో ఉంచుకొని పండ్లు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, మజ్జిగ, తాగునీరు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేశారు.
వివరాలు
బస్సుల్లో ప్రత్యేక ఏర్పాట్లు..
సభకు ప్రజలను తీసుకెళ్లేందుకు ప్రైవేట్ విద్యాసంస్థల బస్సులతో పాటు ఆర్టీసీ బస్సులు ఉపయోగిస్తున్నారు. ప్రతి బస్సులో పౌష్టికాహారంతో కూడిన సరఫరా ఈ విధంగా ఉంది:
120 భోజన ప్యాకెట్లు, 100 అరటి పండ్లు, 120 తాగునీటి సీసాలు, 60 ఓఆర్ఎస్ ప్యాకెట్లు, 60 మజ్జిగ ప్యాకెట్లు, కిచిడి, చట్నీ, ఒక నారింజ పండు ఇతర లాజిస్టిక్ అవసరాల కోసం ప్రతి బస్సులో ఒక ప్రభుత్వ ఉద్యోగిని నియమించారు.
వివరాలు
మూడు పూటల ప్రత్యేక మెనూ
ఎడ వేడిమి నుంచి ఉపశమనం కోసం బహిరంగ సభకు వచ్చే వారికి మజ్జిగ, ఓఆర్ఎస్ టెట్రా ప్యాకెట్లు, పండ్లు వంటి దినుసులను పంపిణీ చేస్తున్నారు.
భోజన ఏర్పాట్లు ఈ విధంగా ఉన్నాయి:
ఉదయం అల్పాహారం: పులిహోర రెండు అరటి పండ్లు రెండు అరలీటరు తాగునీటి సీసాలు ఓఆర్ఎస్ టెట్రా ప్యాకెట్ మజ్జిగ ప్యాకెట్
మధ్యాహ్న భోజనం: వెజిటబుల్ బిర్యానీ రెండు అరటి పండ్లు ఓఆర్ఎస్ టెట్రా ప్యాకెట్ మజ్జిగ ప్యాకెట్ రెండు తాగునీటి సీసాలు
సాయంత్రం స్నాక్స్: రెండు బిస్కెట్ ప్యాకెట్లు రెండు నారింజ పండ్లు ఓఆర్ఎస్ టెట్రా ప్యాకెట్ మజ్జిగ ప్యాకెట్ రెండు తాగునీటి సీసాలు
రాత్రి డిన్నర్: కిచిడీ గోంగూర చట్నీ రెండు తాగునీటి సీసాలు మజ్జిగ ప్యాకెట్