Page Loader
PM Modi: నెహ్రు సర్దార్ పటేల్ సలహాను అంగీకరించి ఉంటే.. ఈ ఉగ్రవాద ఘటనలు జరిగేవి కావు: నరేంద్ర మోదీ 
నెహ్రు సర్దార్ పటేల్ సలహాను అంగీకరించి ఉంటే.. ఈ ఉగ్రవాద ఘటనలు జరిగేవి కావు: నరేంద్ర మోదీ

PM Modi: నెహ్రు సర్దార్ పటేల్ సలహాను అంగీకరించి ఉంటే.. ఈ ఉగ్రవాద ఘటనలు జరిగేవి కావు: నరేంద్ర మోదీ 

వ్రాసిన వారు Sirish Praharaju
May 27, 2025
01:42 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రస్తుతం గుజరాత్ పర్యటనలో ఉన్నారు. మంగళవారం ఆయన గాంధీనగర్‌లోని మహాత్మా మందిర్ వద్ద రూ.5,536కోట్ల విలువైన అనేక అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేయడంతో పాటు,కొన్ని ప్రాజెక్టులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మోదీ, తన ప్రసంగంలో పాకిస్తాన్ చర్యలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గత రెండు రోజులుగా తాను గుజరాత్‌లో ఉన్నానని,వెళ్లిన ప్రతి చోటా రెపరెపలాడుతున్న త్రివర్ణ పతాకం కనిపించిందని మోదీ అన్నారు. దేశ ప్రజల మనసుల్లో దేశం పట్ల ఉన్న అపారమైన ప్రేమ,దేశభక్తి తనకు స్పష్టంగా తెలిసిందని తెలిపారు. మన శరీరం ఎంత బలంగా ఉన్నా లేదా ఆరోగ్యంగా ఉన్నా,ఒక ముల్లు(ఉగ్రవాదం).. శాశ్వతంగా నొప్పిని కలిగిస్తుందని, అందుకే ఆ ముల్లును పూర్తిగా తొలగించాలని తాము నిశ్చయించుకున్నామని వెల్లడించారు.

వివరాలు 

పటేల్ ఇచ్చిన సలహాను అప్పటి ప్రధాని నెహ్రు స్వీకరించి ఉంటే..

మోదీ ప్రకటనలో, 1947లో భారతమాత రెండు భాగాలుగా చీలిపోయిందని, అదే రాత్రి కాశ్మీర్ ప్రాంతంలో మొదటి ఉగ్రవాద దాడి చోటుచేసుకుందని చెప్పారు. ముజాహిదీన్ పేరుతో ఉగ్రవాదులను ఆశ్రయించిన పాకిస్తాన్, భారత్‌లోని కొన్ని ప్రాంతాలను ఆక్రమించుకుందని వివరించారు. అప్పట్లో సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ ఇచ్చిన సలహాను అప్పటి ప్రధాని నెహ్రు స్వీకరించి ఉంటే, గత 75 ఏళ్లుగా జరుగుతున్న ఉగ్ర దాడులు ఉండేవి కావని మోదీ అభిప్రాయపడ్డారు. పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే)ను తిరిగి భారతంలో కలుపుకునే వరకు భారత సైన్యం తిరిగి రాకూడదని సర్దార్ పటేల్ కోరుకున్న విషయాన్ని మోదీ గుర్తు చేశారు. కానీ ఆయన మాటలను అప్పటి నాయకత్వం పాటించలేదని అన్నారు.

వివరాలు 

75 ఏళ్లుగా ఉగ్రవాద సమస్య

ఈ నిర్ణయం ఫలితంగా భారతదేశం 75 ఏళ్లుగా ఉగ్రవాద సమస్యను ఎదుర్కొంటూ వచ్చిందని మోదీ చెప్పారు. తాజాగా పహల్గామ్ ఘటన ఈ పరిణామాలకు ఉదాహరణగా నిలుస్తుందని పేర్కొన్నారు. పాకిస్థాన్‌తో జరిగిన ప్రతి యుద్ధంలో భారతదేశం విజయాన్ని సాధించిందని, భారత సైనిక శక్తికి ఎదురులేదని అన్నారు. ఈ వాస్తవాన్ని తెలుసుకున్న పాకిస్తాన్, ప్రత్యక్ష యుద్ధం వదిలి పరోక్షంగా.. అంటే ఉగ్రవాదం ద్వారా .. యుద్ధానికి దిగిందని తెలిపారు. ఉగ్రవాదులను శిక్షణ ఇచ్చి, భారత్‌పై దాడులకు పంపడం ప్రారంభించిందన్నారు.

వివరాలు 

22 నిమిషాల్లో తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసిన భారత సైన్యం 

తాజాగా నిర్వహించిన "ఆపరేషన్ సిందూర్" సందర్భంలో, 22 నిమిషాల్లో తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను భారత సైన్యం ధ్వంసం చేసింది. ఈ మొత్తం ఆపరేషన్ కెమెరాల ముందు జరిగింది. మే 6న, ఉగ్రవాదుల మృతదేహాలకు పాకిస్తాన్ ప్రభుత్వం అధికారిక గౌరవం అందించిందని, వారి శవపేటికలపై పాక్ జెండాలు రెపరెపలాడాయనీ, అక్కడి సైన్యం వారిని సెల్యూట్ చేసిందనీ.. ఈ చర్యలు పాకిస్తాన్ ఉగ్ర వ్యూహానికి స్పష్టమైన నిదర్శనమని ప్రధాని స్పష్టం చేశారు.

వివరాలు 

పదేళ్లకు సరిపోయే విధంగా ఇప్పటినుంచే ప్రణాళికలు

ఒకప్పుడు ఉప్పు తప్ప మరేదీ లేని గుజరాత్, ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా వజ్రాలకు ప్రసిద్ధి చెందినదని ప్రధాని మోదీ పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని వచ్చే పదేళ్లకు సరిపోయే విధంగా ఇప్పటినుంచే ప్రణాళికలు రూపొందించుకోవాలని ఆయన సూచించారు. గుజరాత్ పారిశ్రామిక, వ్యవసాయ, విద్య, క్రీడా రంగాల్లో వచ్చే దశాబ్దంలో ఎక్కడికి చేరుతుందో అన్న దానికి మనం ఒక దార్శనిక దృక్పథాన్ని ఏర్పరచుకోవాలన్నారు.