
Cleanest Air: కాలుష్యంలేని నగరాలు.. దేశంలోని తక్కువ కాలుష్య నగరాల జాబితా ఇదే
ఈ వార్తాకథనం ఏంటి
దేశంలో గాలి కాలుష్యం గురించి అనేక నగరాలు తీవ్రంగా బాధపడుతున్నాయి. వాటిలో దిల్లీ, యూపీ, నోయిడా, లక్నో వంటి ఉత్తర భారతదేశంలోని ప్రధాన నగరాలు ప్రముఖంగా ఉన్నాయి.
ఈ నగరాలలో గాలి నాణ్యత సూచీ (ఏక్యూఐ) 450కుపైగా నమోదవుతుంది. ఇది ఆరోగ్యానికి ప్రమాదకరమైన స్థాయిలో ఉంది. ఈ పరిస్థితుల వల్ల ప్రజలు అనారోగ్యాల భారీన పడుతున్నారు.
కళ్ల మంటలు, తలనొప్పులు, తదితర అనారోగ్య సమస్యలు వస్తున్నాయని వాపోతున్నారు. ఇక, దేశంలో పలు నగరాలు మంచి గాలి నాణ్యతతో ఉండడంతో ప్రజలు ఆహ్లాదంగా జీవిస్తున్నారు.
Details
గాలి నాణ్యతలో ఐజ్వాల్ మొదటిస్థానం
కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి డేటా ప్రకారం, మిజోరంలోని ఐజ్వాల్ గాలి నాణ్యత 26 వద్ద ఉందని, ఇది మంచి కేటగిరీగా పరిగణించారు.
ఈ కారణంగా అక్కడి నివాసితులు ఆరోగ్యకరమైన వాతావరణంలో ఉన్నారు. ఐజ్వాల్ తర్వాత సిక్కింలోని గ్యాంగ్‌టక్, మేఘాలయాలోని షిల్లాంగ్ నగరాలు కూడా చక్కటి గాలి నాణ్యతను కనబరిచాయి.
ఈ నగరాలలో ఏక్యూఐ స్థాయిలు వరుసగా 35 మరియు 36 వద్ద ఉన్నాయి.
తర్వాతి స్థానాల్లో గువాహటి (అస్సాం) - 40, చామరాజనగర్ (కర్ణాటక) - 41, బాగల్‌కోట్ (కర్ణాటక) - 42, త్రిస్సూర్ (కేరళ) - 43, నహర్లగన్ (అరుణాచల్ ప్రదేశ్) - 51, నాగాన్ (అస్సాం) - 53 ఉన్నాయి.
Details
అత్యంత కాలుష్యనగరంగా దిల్లీ
ఇతర నగరాలు తక్కువ కాలుష్యంతో ఉన్నా, దిల్లీ అత్యంత కాలుష్యమయమైన నగరంగా కొనసాగుతోంది.
ఇక్కడ గాలి నాణ్యత సూచీ బుధవారం ఉదయం 422 వద్ద నమోదైంది.
ఇది మరింత ప్రమాదకరమైన స్థాయిలో ఉంది. మంగళవారంతో పోలిస్తే, ఈ సూచీ 494 నుండి 422కి తగ్గింది.