తదుపరి వార్తా కథనం

Pooja Khedkar: మహారాష్ట్ర ఎన్నికలలో పూజా ఖేద్కర్ తండ్రి పోటీ.. వివాదాస్పదమైన అఫిడవిట్
వ్రాసిన వారు
Sirish Praharaju
Oct 28, 2024
08:42 am
ఈ వార్తాకథనం ఏంటి
తప్పుడు ధ్రువపత్రాలు సమర్పించి సివిల్స్ ఎంపిక ప్రక్రియలో అవకతవకలకు పాల్పడ్డారన్న ఆరోపణలతో మహారాష్ట్రకు చెందిన పూజా ఖేద్కర్ (Pooja Khedkar) అభ్యర్థిత్వాన్ని యూపీఎస్సీ రద్దు చేసిన సంగతి తెలిసిందే.
తాజాగా, ఆమె పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. పూజా తండ్రి దిలీప్ ఖేడ్కర్ మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. అహ్మద్‌నగర్ దక్షిణ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా ఆయన నామినేషన్ దాఖలు చేశారు.
అయితే, ఈ సందర్భంగా దిలీప్ ఖేడ్కర్ దాఖలు చేసిన అఫిడవిట్ వివాదాస్పదమైంది.
తాను భార్య నుంచి విడాకులు తీసుకున్నట్లు తాజా అఫిడవిట్‌లో ఆయన పేర్కొన్నారు.
అయితే, కొన్ని నెలల క్రితం జరిగిన లోక్‌సభ ఎన్నికల్లోనూ నామినేషన్ దాఖలు చేసినప్పుడు తాను భార్యతో కలిసి ఉన్నట్లు తెలిపారు.