Pragathi Bhavan: బద్దలైన ప్రగతి భవన్ గేట్లు.. అంబేద్కర్ ప్రజాభవన్'లో భారీ మార్పులు
తెలంగాణ ముఖ్యమంత్రి అధికారిక నివాసం ప్రగతి భవన్ గేట్లు బద్దలయ్యాయి. ఈ మేరకు గత ప్రభుత్వ తాలుకా ఉన్న ఛాయలన్నీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం తొలగిస్తోంది. ఈ క్రమంలోనే ప్రగతి భవన్‌లో భారీగా మార్పులు చేర్పులతో అంబేద్కర్ ప్రజా భవన్‌గా పేరు మారింది. కాంగ్రెస్ సర్కారు హయాంలో సామాన్యుేలకి సైతం ప్రజా భవన్‌లోకి ప్రవేశం ఉంటుందని ప్రకటించారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం హయాంలో ప్రగతి భవన్'లోకి మంత్రులకు కూడా ప్రవేశం ఉండేది కాదని, ఇప్పుడు సాధారణ ప్రజలకు ప్రవేశం కల్పిస్తామని కాంగ్రెస్ గతంలోనే ప్రకటించింది. 2016 నవంబరు 23న నిర్మించిన సీఎం అధికార నివాసం రూ.38 కోట్లు ఖర్చయ్యాయి.ముంబైకి చెందిన షాపూర్జీ పల్లోంజి నిర్మాణ సంస్థ 9 ఎకరాల్లో ప్రగతి భవన్ నిర్మించారు.