
GST on Prasadam: జీఎస్టీ నుంచి ప్రసాదానికి మినహాయింపు.. లోక్‌సభలో నిర్మలా సీతారామన్ ప్రకటన
ఈ వార్తాకథనం ఏంటి
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) వస్తు, సేవల పన్ను (GST) నుంచి ప్రసాదాన్ని మినహాయిస్తున్నట్లు వెల్లడించారు.
మంగళవారం జరిగిన లోక్‌సభ సమావేశాల్లో, ఆర్థిక బిల్లు 2025పై చర్చ సందర్భంగా ఆమె ఈ ప్రకటన చేశారు.
ఆలయాలు, ప్రార్థనా మందిరాల్లో విక్రయించే ప్రసాదాలపై జీఎస్టీ (GST on Prasadam) వర్తించదని స్పష్టంగా తెలియజేశారు.
వివరాలు
డిజిటల్ పన్ను రద్దు
ఆర్థిక మంత్రి డిజిటల్ పన్ను (Digital Tax)లేదా ఈక్వలైజేషన్ లెవీని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.
అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితుల్లో అస్థిరతను తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె వివరించారు.
లోక్‌సభలో ప్రవేశపెట్టిన ఆర్థిక బిల్లు 2025 (Finance Bill 2025)లో ప్రతిపాదించిన 59 సవరణల్లో ఇది కూడా ఒకటిగా ఉందన్నారు.
అమెరికా ప్రతీకార సుంకాల నడుమ కీలక నిర్ణయం
ఏప్రిల్ 2 నుంచి భారత్‌పై అమెరికా ప్రతీకార సుంకాలు విధించనున్న నేపథ్యంలో, గూగుల్,మెటా, ఎక్స్ వంటి పెద్ద సంస్థలకు అనుకూలంగా ఉండేలా ఆన్‌లైన్ ప్రకటనలపై 6% ఈక్వలైజేషన్ లెవీ తొలగిస్తున్నట్లు నిపుణులు భావిస్తున్నారు.2016 జూన్ 1 నుంచి అమలులో ఉన్న ఈ పన్నును ఇక రద్దు చేస్తున్నట్లు నిర్మలా సీతారామన్ ప్రకటించారు.
వివరాలు
ఆదాయపు పన్ను బిల్లు - వర్షాకాల సమావేశాల్లో చర్చ
తొలి విడత బడ్జెట్ (Union Budget) సమావేశాల్లో ప్రవేశపెట్టిన కొత్త ఆదాయపు పన్ను బిల్లును (Income Tax Bill) వచ్చే వర్షాకాల సమావేశాల్లో చర్చకు తీసుకువస్తామని ఆర్థిక మంత్రి తెలిపారు.
ఫిబ్రవరి 13న లోక్‌సభలో ప్రవేశపెట్టిన ఈ బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపించామని, కమిటీ అధ్యయనం చేసి వచ్చే పార్లమెంట్ సమావేశాల ప్రారంభ నాటికి నివేదిక సమర్పించాల్సి ఉందని తెలిపారు.
తయారీ, ఎగుమతులకు మద్దతుగా కస్టమ్స్ సుంకాల మార్పు తయారీ రంగానికి సహాయపడటానికి, ఎగుమతులను ప్రోత్సహించేందుకు, సామాన్య ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు కస్టమ్స్ సుంకాలను హేతుబద్ధంగా మారుస్తామని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు.