
Prashant Kishor: 'ద్రోహి' అనడంలో తప్పేముంది?.. కునాల్ కమ్రాకు అండగా ప్రశాంత్ కిషోర్
ఈ వార్తాకథనం ఏంటి
స్టాండప్ కమెడియన్ కునాల్ కమ్రాకు రాజకీయ వ్యూహకర్త,జన్ సూరజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ మద్దతుగా నిలిచారు.
కునాల్ కమ్రా తన స్నేహితుడని,తనకు తెలిసినంతవరకు ఆయన రాజకీయాలలోకి రావాలనే ఉద్దేశం లేదని అన్నారు.
బహుశా 'ద్రోహి' అనే మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారని వివరించారు.కునాల్ కమ్రా ప్రస్తుతం పుదుచ్చేరిలో నివాసం ఉంటున్నారని చెప్పారు.
ఒక వైపు సేంద్రీయ వ్యవసాయం చేస్తూనే, మరోవైపు స్టాండప్ కామెడీని కొనసాగిస్తున్నారని వివరించారు.
ఆయనకు రాజకీయంగా ఎలాంటి శత్రుత్వం లేదని,దేశాన్ని ప్రేమించే వ్యక్తుల్లో కునాల్ కమ్రా ఒకరని పేర్కొన్నారు.
రాజ్యాంగం పట్ల ఆయనకు గౌరవం ఉందని,కేవలం ఆయన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకోవడం వల్లే ఈ వివాదం నెలకొందని తెలిపారు.
ఏదైనా అభ్యంతరాలుంటే, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.
వివరాలు
మద్రాస్ హైకోర్టు మధ్యంతర బెయిల్
కునాల్ కమ్రా మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేను ఉద్దేశించి 'ద్రోహి' అని సంబోధించడంతో ఈ వివాదం రగిలింది.
ఆయన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. దీంతో శివసేన కార్యకర్తలు కునాల్ కమ్రా ప్రదర్శన నిర్వహించిన క్లబ్‌పై దాడి చేసి ధ్వంసం చేశారు.
అనంతరం పోలీస్ స్టేషన్లలో ఆయనపై ఫిర్యాదు చేశారు. ఇప్పటికే ముంబై పోలీసులు రెండు సార్లు సమన్లు జారీ చేసి, హాజరయ్యేలా సూచించారు.
అయితే, కునాల్ కమ్రా హాజరు కాలేదు. ఈ క్రమంలో మద్రాస్ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడం ఆయనకు కొంత ఊరట కలిగించింది.