
Gandhi Jayanti: రాజ్‌ఘాట్‌లో గాంధీజీకి నివాళులర్పించిన రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ
ఈ వార్తాకథనం ఏంటి
మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాజ్‌ఘాట్‌లో గాంధీజీకి నివాళులర్పించారు.
బుధవారం ఉదయం దిల్లీలో గాంధీ స్మారక ప్రదేశమైన రాజ్‌ఘాట్ వద్ద మహాత్మునికి అంజలి ఘటించారు.
అంతకుముందు ప్రధానమంత్రి నరేంద్రమోదీ సోషల్ మీడియా వేదిక 'ఎక్స్'లో గాంధీజీని స్మరించుకున్నారు.
'సత్యం, సామరస్యం, సమానత్వం అనే మహోన్నత సిద్ధాంతాలతో మహాత్ముని జీవితం కొనసాగిందని కొనియాడారు. ఆయన ఆదర్శాలు నేటికీ దేశ ప్రజలకు మార్గదర్శకంగా నిలుస్తున్నాయని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
Details
మహత్మగాంధీ సేవలను కొనియాడిన రాహుల్ గాంధీ
కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి జగ్‌దీప్ ధన్‌ఖడ్, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా, దిల్లీ ముఖ్యమంత్రి ఆతిశీ తదితర ప్రముఖులు కూడా పాల్గొని మహాత్ముని నివాళులర్పించారు.
అనంతరం గాంధీజీ చేసిన సేవలను గుర్తుచేసుకున్నారు.