Narendra Modi: ఎన్నికల సంఘంపై ప్రధాని మోదీ పొగడ్తల వర్షం
ఈ వార్తాకథనం ఏంటి
దేశంలో ఎన్నికలను నిష్పక్షపాతంగా నిర్వహించడంలో కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) చేసిన కృషిని ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం ప్రశంసించారు.
ఆయన 'మన్ కీ బాత్' కార్యక్రమంలో మాట్లాడుతూ, ఓటింగ్ ప్రక్రియను ఆధునికీకరించడంలో ఈసీ పాత్రను అభినందించారు.
ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడం ద్వారా ఎన్నికల సంఘం దేశ ప్రజాస్వామ్య మనుగడలో కీలకమైన భాగంగా ఉందని ప్రధాని తెలిపారు.
రాజ్యాంగ నిర్మాతలు కూడా రాజ్యాంగంలో ఎన్నికల సంఘానికి ప్రాముఖ్యత ఇచ్చారని, 1951-52లో తొలిసారి నిర్వహించిన ఎన్నికలు దేశ ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాయన్నారు.
Details
ఇస్రో సాధించిన విజయాలపై ప్రశంస
ఈ నెల నాలుగోవారం గణతంత్ర దినోత్సవం ఉండటంతో, ఈ నెల 26 నాటికి భారత్ గణతంత్రంగా 75 ఏళ్ల ఉత్సవాన్ని జరుపుకుంటుందని, ఈ సంవత్సరం గణతంత్ర దినోత్సవం ప్రత్యేకమని చెప్పారు.
ఈ సందర్భంలో రాజ్యాంగ నిర్మాతల పనితీరుపై ఆయన వందనం తెలపారు. అలాగే ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న కుంభమేళాను దేశంలో విభిన్నతలో ఏకత్వానికి ప్రతీకగా పేర్కొన్నారు.
అయోధ్యలో రామమందిరం నిర్మాణానికి సంబంధించిన విషయాలను కూడా ప్రస్తావించారు.
అంతరిక్షంలో ఇస్రో సాధించిన విజయాలపై ప్రశంసలు కురిపించిన ప్రధాని, అస్సాంలో ఏనుగుల ఆకలి తీర్చేందుకు గ్రామస్తుల ప్రయత్నాన్ని కూడా కొనియాడారు.