PM Modi's degree row: ఆప్ నేతలపై గుజరాత్ కోర్టులో పరువునష్టం కేసు..స్టే విధించిన సుప్రీంకోర్టు
ప్రధాని నరేంద్ర మోదీ విద్యార్హతపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్,ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ చేసిన వ్యాఖ్యలపై గుజరాత్ యూనివర్శిటీ దాఖలు చేసిన పరువునష్టం ఫిర్యాదుపై ట్రయల్ కోర్టులో విచారణను సుప్రీంకోర్టు మంగళవారం నిలిపివేసింది. గుజరాత్‌లోని ట్రయల్ కోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసును రాష్ట్రం వెలుపల, కోల్‌కతాకు బదిలీ చేయాలంటూ సింగ్ చేసిన పిటిషన్‌ను విచారిస్తున్నప్పుడు జస్టిస్‌లు బిఆర్ గవాయ్, సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం ఈ ఆదేశాలను జారీ చేసింది. ట్రయల్ కోర్టు తమకు జారీ చేసిన సమన్లను రద్దు చేయాలని కోరుతూ ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేతలు దాఖలు చేసిన పిటిషన్‌పై నాలుగు వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలని గుజరాత్ హైకోర్టును సుప్రీంకోర్టు ఆదేశించింది.
హైకోర్టు ఆదేశాలను సవాలు చేస్తూ పిటిషన్..నిరాకరించిన సుప్రీంకోర్టు
ఈలోగా,ట్రయల్ కోర్టులో విచారణ కొనసాగుతుందని బెంచ్ తెలిపింది.సింగ్,న్యాయవాది కరణ్ శర్మ ద్వారా సుప్రీం కోర్టులో దాఖలు చేసిన తన పిటిషన్‌లో, ట్రయల్ కోర్టులో విచారణలో పక్షపాతం ఉందని ఆరోపించారు. హైకోర్టులో పిటిషన్ పెండింగ్‌లో ఉండగా,ట్రయల్ జడ్జి ఈ అంశాన్ని కొనసాగిస్తున్నారని అన్నారు. గత ఏడాది ఆగస్టులోయూనివర్సిటీ దాఖలు చేసిన క్రిమినల్ పరువు నష్టం కేసులపై స్టే విధించాలన్న కేజ్రీవాల్ అభ్యర్థనను తిరస్కరించిన హైకోర్టు ఆదేశాలను సవాలు చేస్తూ చేసిన పిటిషన్‌ను స్వీకరించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. సమాచార హక్కు చట్టం కింద మోదీ విద్యార్హతలకు సంబంధించిన సమాచారాన్ని అందించాలని ప్రధాన సమాచార కమిషనర్‌ను గుజరాత్ హైకోర్టు కొట్టివేసిన నేపథ్యంలో కేజ్రీవాల్,సింగ్ వ్యాఖ్యలపై గుజరాత్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ పీయూష్ పటేల్ పరువు నష్టం దావా వేశారు.
సెషన్స్ కోర్టులో రివిజన్ దాఖలు
తమపై క్రిమినల్ పరువు నష్టం కేసులపై మధ్యంతర స్టే విధించాలని కోరుతూ కేజ్రీవాల్, సింగ్‌లు దాఖలు చేసిన పిటిషన్‌ను గత ఏడాది ఆగస్టు 11న హైకోర్టు తిరస్కరించింది. మోడీ విద్యా డిగ్రీలకు సంబంధించి వారి "వ్యంగ్య","అవమానకరమైన" ప్రకటనలపై పరువు నష్టం కేసులో గుజరాత్ మెట్రోపాలిటన్ కోర్టు గతంలో కేజ్రీవాల్,సింగ్‌లకు సమన్లు జారీ చేసింది. ఆ తర్వాత ఇద్దరు ఆప్ నేతలు మెట్రోపాలిటన్ కోర్టు సమన్లను సవాల్ చేస్తూ సెషన్స్ కోర్టులో రివిజన్ దరఖాస్తును దాఖలు చేశారు. అయితే, విచారణపై మధ్యంతర స్టే విధించాలన్న వారి విజ్ఞప్తిని సెషన్స్ కోర్టు తిరస్కరించింది, ఆ తర్వాత వారు హైకోర్టును ఆశ్రయించారు.