Gurmeet Ram Rahim Acquitted: హత్య కేసులో డేరా సచ్చా సౌదా చీఫ్ ను నిర్దోషిగా ప్రకటించిన పంజాబ్, హర్యానా హైకోర్టు
డేరా మేనేజర్ రంజిత్ సింగ్ హత్య కేసులో డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్‌తో పాటు మరో నలుగురిని పంజాబ్,హర్యానా హైకోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. 2021 సంవత్సరంలో,రంజిత్ సింగ్ హత్య కేసులో రామ్ రహీమ్, ఇతర నిందితులను సీబీఐ కోర్టు దోషులుగా నిర్ధారించి వారికి జీవిత ఖైదు విధించింది. రంజిత్ సింగ్ హత్య కేసులో డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సహా ఐదుగురు దోషులకు పంచకుల ప్రత్యేక కోర్టు జీవిత ఖైదు విధించింది.
గుర్మీత్ రామ్ రహీమ్‌కు రూ.31 లక్షల జరిమానా
దీంతో పాటు గుర్మీత్ రామ్ రహీమ్‌కు రూ.31 లక్షల జరిమానా కూడా విధించారు. రంజిత్ సింగ్ హత్య కేసులో దోషులందరికీ వివిధ సెక్షన్ల కింద శిక్షలు పడ్డాయి. గుర్మీత్ రామ్ రహీమ్‌కు ఉరిశిక్ష విధించాలని సీబీఐ డిమాండ్ చేయగా,కోర్టు అతనికి జీవిత ఖైదు విధించింది. మరోవైపు, ఈ నిర్ణయాన్ని పంజాబ్, హర్యానా హైకోర్టులో సవాలు చేస్తానని గుర్మీత్ రామ్ రహీమ్ తరపు న్యాయవాది అజయ్ వర్మన్ తెలిపారు.