Page Loader
AP Dy Speaker: ఏపీ అసెంబ్లీలో డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ, చీఫ్‌ విప్‌లుగా అనురాధ, ఆంజనేయులు
ఏపీ అసెంబ్లీలో డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ, చీఫ్‌ విప్‌లుగా అనురాధ, ఆంజనేయులు

AP Dy Speaker: ఏపీ అసెంబ్లీలో డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ, చీఫ్‌ విప్‌లుగా అనురాధ, ఆంజనేయులు

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 13, 2024
09:34 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో డిప్యూటీ స్పీకర్ పదవికి మాజీ ఎంపీ, ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణరాజును ఎంపిక చేశారు. టీడీపీ సీనియర్ల సంఖ్య ఎక్కువగా ఉండటంతో, శాసనసభాపతి స్థానం ఆశించిన ఆయనకు డిప్యూటీ స్పీకర్ పదవి లభించింది. ఉండి నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి పోటీ చేసి ఆయన విజయం సాధించారు. కొత్త శాసన సభ్యుల శిక్షణా కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్ పదవికి ఆయన పేరు ఖరారు చేశారు. ప్రస్తుతం వైసీపీ సభ్యులు తక్కువ సంఖ్యలో ఉన్నందున, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక లాంఛనంగానే జరుగనుంది. ఏపీ అసెంబ్లీలో విప్‌లు, చీఫ్ విప్‌ల పదవులను కేటాయించారు.

Details

16 మంది సభ్యులకు విప్ పదవులు

అన్ని ప్రాంతాలకు ప్రాధాన్యత ఇస్తూ, సీనియార్టీ ఆధారంగా 16 మంది సభ్యులకు విప్ పదవులు అందజేశారు. శాసనసభ చీఫ్ విప్‌గా గోనుగుంట్ల వెంకట శివ సీతారామాంజనేయులు (జీవీ ఆంజనేయులు) నియమించారు. శాసనమండలిలో పంచుమర్తి అనురాధ చీఫ్ విప్‌గా ఎంపికయ్యారు. ఇక శాసనసభలో విప్‌గా నియమితులైనవారిలో బీజేపీ, జనసేన, టీడీపీ సభ్యులున్నారు. వారిలో రాయలసీమ, ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర ప్రాంతాలకు చెందిన వారు ఉన్నారు. మండలిలో వేపాడ చిరంజీవిరావు, కంచర్ల శ్రీకాంత్ (టీడీపీ), పిడుగు హరిప్రసాద్ (జనసేన) విప్‌లుగా నియమితులయ్యారు.