Rahulgandhi:ఒలింపిక్ ఫైనల్స్‌లోకి వినేష్ ఫోగట్ ఎంట్రీ.. రాహుల్ గాంధీ అభినందన
పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత మహిళా రెజ్లర్ వినేష్ ఫోగట్ చరిత్ర సృష్టించింది. 50 కేజీల ఫ్రీస్టైల్ ఈవెంట్‌లో క్యూబా రెజ్లర్ యూస్నీలీస్ గుజ్‌మాన్‌ను 5-0తో ఓడించడం ద్వారా ఆమె ఫైనల్స్‌లో తన స్థానాన్ని ఖాయం చేసుకుంది. తన అద్భుత ప్రదర్శనకు దేశవ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో వినేష్‌కు రాజకీయ నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఎక్స్ వేదికగా వినేష్ ఫోగట్ కి శుభాకాంక్షలు తెలిపారు.
బబితా ఫోగట్ సోషల్ మీడియా పోస్ట్
"ప్రపంచంలోని ముగ్గురు గొప్ప రెజ్లర్లను ఒకేరోజు ఓడించిన తర్వాత వినేశ్‌తో పాటు దేశం మొత్తం ఉద్వేగానికి లోనైంది. వినేష్,ఇతర ఆటగాళ్ల పోరాటాన్ని అబద్ధం చేసిన వారందరికీ,వారి ఉద్దేశాలు, సామర్థ్యాలపై ప్రశ్నలు లేవనెత్తిన వారందరికీ సమాధానాలు వచ్చాయి. ఆమెను కన్నీళ్లు పెట్టించిన అధికార వ్యవస్థ మొత్తం నేడు భారత వీర పుత్రిక ముందు కుప్పకూలింది. ఇది ఛాంపియన్ల గుర్తింపు, వారు ఫీల్డ్ నుండి వారి సమాధానాన్నిఇస్తారు. వినేష్ శుభాకాంక్షలు.పారిస్‌లో మీ విజయ ప్రతిధ్వని ఢిల్లీ వరకు స్పష్టంగా వినిపిస్తోంది" అంటూ ఎక్స్ పోస్ట్ లోరాసుకొచ్చారు. మహిళల రెజ్లింగ్‌లో ఒలింపిక్ ఫైనల్‌కు చేరిన తొలి భారతీయ మహిళా రెజ్లర్‌గా వినేష్ ఫోగట్ నిలిచిందని బబితా ఫోగట్ సోషల్ మీడియా పోస్ట్‌లో తెలిపారు.ఫైనల్స్‌లో విజయం సాధించాలని ఆకాంక్షించారు.