Page Loader
Rahul Gandi: బీజేపీపై ప్రజల్లో భయం పోయింది.. సంచలన వ్యాఖ్యలు చేసిన రాహుల్ గాంధీ 
బీజేపీపై ప్రజల్లో భయం పోయింది.. సంచలన వ్యాఖ్యలు చేసిన రాహుల్ గాంధీ

Rahul Gandi: బీజేపీపై ప్రజల్లో భయం పోయింది.. సంచలన వ్యాఖ్యలు చేసిన రాహుల్ గాంధీ 

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 10, 2024
09:10 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రజల్లో బీజేపీపై ఉన్న భయం పోయిందని లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ఆయన అమెరికా పర్యటనలో భాగంగా వర్జీనియాలోని హెర్న్‌డాన్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌పై తీవ్ర విమర్శలు చేశారు. 2024 సార్వత్రిక ఎన్నికల తరువాత దేశంలో భయానికి చోటు లేదని చెప్పారు. బీజేపీ ఏజెన్సీల ద్వారా భయాన్ని వ్యాప్తి చేశారని, కానీ ఒక్క క్షణంలో అది అంతా కరిగిపోయిందని, వారి మానసికత, ప్రణాళికలన్నీ ఇప్పుడు చరిత్రగా మిగిలాయన్నారు.

Details

బీజేపీ, ఆర్ఎస్ఎస్‌ల వ్యతిరేక యుద్ధం

ఆర్‌ఎస్‌ఎస్ భారతదేశం అంటే ఏకైక ఆలోచన అని నమ్ముతుందని, కానీ భారతదేశం అనేక ఆలోచనల సమాహారమని అన్నారు. భారత రాజ్యాంగంలో వివిధ రాష్ట్రాలు, భాషలు, సంప్రదాయాలు అన్ని సమానంగా ఉన్నాయని స్పష్టంగా చెప్పారని, బీజేపీ అనేది యూనియన్ కాదని విమర్శించారు. ప్రధాని మోదీ భారత రాజ్యాంగంపై దాడి చేస్తున్నారని, దీనిని ప్రజలు గ్రహించారని, ఇది బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లకు వ్యతిరేకంగా యుద్ధమని రాహుల్ గాంధీ వివరించారు.